ఈ చిన్నారులు స్టార్ హీరో పిల్లలు అని మీకు తెలుసా?

ప్ర‌తీ ఏడాది అక్టోబ‌ర్ 31న హాలో వీన్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతాయి.ఈ వేడుకల్లో చిన్నారులు, యువ‌కులు రాక్ష‌సులు, దెయ్యాల వేషాల‌తో అంద‌ర్ని బ‌య‌పెడుతారు.

రాత్రి పూట అంద‌రూ క‌లిసి భోజ‌నాలు చేస్తారు.ఇప్పటికే ఈ సాంప్ర‌దాయం యూకే, ఫ్రాన్స్, కెన‌డా తో పాటు క్రిస్టియ‌న్ క‌మ్యూనిటీ ఎక్కువ‌గా ఉన్న అమెరికా దేశాల్లో ఈ వేడుక‌లు జ‌రుపుకునేందుకు ఉత్సాహం చూపిస్తారు.

వాస్త‌వానికి ఈ వేడుక‌ల్ని క్రిస్టియ‌న్ క‌మ్యూనిటీకి చెందిన ప్ర‌జ‌లు 7,8 శ‌తాబ్ధ‌కాలంలో యూర‌ప్ రోమ్ లో క్రైస్త‌వ మ‌త గురువు పోప్ న‌వంబ‌ర్ 1న సెంయిట్స్ గౌర‌వార్ధం ఆల్ సెయింట్స్ డే పేరుతో వేడుక‌లు నిర్వ‌హిస్తారు.

ఆ ముందురోజు అక్టోబ‌ర్ 31న హాలోవీన్ వేడుక‌లు జ‌రుపుతారు.తాజాగా అల్లు కుటుంబం హాలోవిన్ వేడుక‌ల్ని ఘ‌నంగా జ‌రిపింది.

ఈ వేడుకల్లో అల్లు అర్జున్ పిల్ల‌లు అయాన్, అర్హ‌ లు హల్ చల్ చేశారు.

లాక్ డౌన్ లో వారి హంగామా ఎలా ఉందో మనకు తెలియంది కాదు.

ముఖ్యంగా అల్లు అర్జున్, తన పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలోషేర్ చేస్తుంటారు.

నాన్న చెప్పిన అబ్బాయిని చేసుకో నాన్న ప్లీజ్.చేసుకుంటావా.

నాలాగా చెప్పు.నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని స్టైలిష్ స్టార్ అర్హను అడిగితే.

అర్హా నేను చేసుకోను అని అంటుంది.అంతే చేసుకోవా.

దొంగ అంటూ చక్కిలిగిలింతలు పెడతాడు.ఆ చక్కిలిగిలింతలు వీడియో ఇప్పటికి నెట్టింట్లో ఎంతోమందిని ఆకట్టుకుంటుంది.

అలా వైకుంఠపురం సినిమా ప్రోమో విడుదల తరువాత అల్లు అర్జున్ మరో వీడియోను విడుదల చేశాడు.

ఆ వీడియోలో ఏంట్రోయ్ గ్యాపిచ్చావ్ అని బన్నీ అడిగితే.ఇవ్వలేదు వచ్చింది అని అర్హ చెప్పిన సమాధానం రాములో రాములా సాంగ్ కు బన్నీ వేసిన డ్యాన్స్ పై ముద్దుముద్దుగా సెటైర్లు వేసింది.

రాములో రాములా పాట ఉంది కదా.అందులో నాన్న ఏ స్టెప్ వేసారు అని అడిగితే.

దోసా స్టెప్ అంటూ బన్నీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది.తాజాగా అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన హాలో వీన్ వేడుక‌ల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య‌ స్నేహారెడ్డి పిల్ల‌లు అయాన్, అర్హ‌లు భ‌య‌పెట్టేలా గెటప్ వేయించింది.

ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇండియాకు వచ్చిన ఫ్రెంచ్ సైకిలిస్టులకు గూగుల్ మ్యాప్స్ దిమ్మతిరిగే షాక్..