బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బన్నీ.. ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేశాడుగా!

తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా( Pan India ) ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాలలో పుష్ప 2 సినిమా కూడా ఒకటి.

ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ కావడంతో రెండో భాగం మీద అంచనాలు మామూలుగా లేవు.

దానికి తోడు పుష్ప 2 సినిమా( Pushpa 2 ) నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.

ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన టీజర్ ఆ అంచనాలను కాస్త మరింత పెంచేసింది.

తాజాగా రిలీజైన టీజర్లో జాతర సెటప్‌లో సాగిన విజువల్స్ వావ్ అనిపించాయి. """/"/ గంగమ్మ అవతారంలో అల్లు అర్జున్( Allu Arjun ) లుక్.

తన మేనరిజమ్స్, యాక్ట్స్ తో దులిపేశాడు.దీంతో ఈ సినిమాపై అభిమానులు అంచనాలను మరింత పెంచేసుకున్నారు.

భారతీయ సినిమా పరిశ్రమలో మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప 2 అనే మాట ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది.

కాగాపాన్ ఇండియా సినిమాగా రూపొందిన పుష్ప: ది రూల్ బిజినెస్( Pushpa The Rule ) పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నది.

ఈ సినిమా ఆడియో, డిజిటల్ రైట్స్ ఊహకు అందని విధంగా అమ్ముడుపోతున్నాయి.థియేట్రికల్ రిలీజ్‌కు సంబంధించిన హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

తాజాగా నైజాం హక్కుల అమ్మకం వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. """/"/ పుష్ప 2 సినిమా థియేట్రికల్ రైట్స్( Pushpa 2 Theatrical Rights ) రికార్డు ధరకు అమ్ముడుపోయాయి.

నైజాంకు చెందిన డిస్టిబ్యూటర్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకొన్నాడు.ఈ మూవీ హక్కులు సుమారుగా 100 కోట్ల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ నిపుణులు తెలిపారు.

అయితే పుష్ప నైజాం థియేట్రికల్ బిజినెస్ విషయంలో ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డును తుడిపేసింది.

రాజమౌళి( Rajamouli ) సినిమా బిజినెస్ 100 కోట్ల కంటే తక్కువగా జరిగింది.

ప్రస్తుతం నైజాంలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, పుష్ప 2 సినిమా రిలీజ్‌కు ముందు బడా నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి వెనకాడుతున్నారు.

బాలీవుడ్‌లో ఈ సినిమాకు పోటీగా చిత్రాలను రిలీజ్ చేయడానికి ముందుకు రావడం లేదు.

బాలీవుడ్‌లో ఇప్పటికే రిలీజ్ డేట్స్ ప్రకటించుకొన్న సినిమాలు తమ మూవీ రిలీజ్‌ను వాయిదా వేసుకొంటున్నాయి.

దీన్ని బట్టి చూస్తే పుష్ప సినిమా ఈసారి రికార్డులు తిరగబడడం ఖాయం అనిపిస్తోంది.

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ … వీటిపై క్లారిటీ