Allu Arjun : వైరల్ అవుతున్న అల్లు అర్జున్ ఒకప్పటి ఫోటో.. సర్జరీ ముందు అలా ఉండేవాడా?
TeluguStop.com
సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి.ముఖ్యంగా వారికి సంబంధించిన ఒకప్పటి ఫోటోలు ఉంటే మాత్రం బాగా హల్ చెల్ చేస్తూ ఉంటాయి.
కొన్ని కొన్ని సార్లు అవి ట్రోల్స్ కు కూడా గురవుతూ ఉంటాయి.అయితే ఇప్పుడు అల్లు అర్జున్( Allu Arjun ) కు సంబంధించిన ఒక ఫోటో కూడా ఇట్టే వైరల్ అవుతుంది.
అందులో అల్లు అర్జున్ లుక్ చూసి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇంతకూ ఆ ఫొటోలో ఎలా ఉన్నాడో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తున్న అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.రీసెంట్ గానే జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు కూడా సొంతం చేసుకొని అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు.
ఇక కెరీర్ మొదట్లోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. """/" /
తొలిసారిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అల్లు అర్జున్ బాలనటుడుగా పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత చిరంజీవి నటించిన డాడీ సినిమాలో అతిధి పాత్రలో నటించాడు.ఇక 2003లో గంగోత్రి సినిమా( Gangothri )తో తొలిసారిగా హీరోగా పరిచయం అయ్యాడు.
ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు.తర్వాత ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు, డిజె దువ్వాడ జగన్నాథం వంటి పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.
"""/" /
ఇక మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచాయి కూడా.అయినా కూడా ధైర్యంతో ముందుకు కొనసాగాడు.
ఇక ఏడాది కిందట పుష్ప సినిమా( Pushpa )తో పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు అల్లు అర్జున్.
తెలుగులోనే కాకుండా పలు భాషలలో కూడా ఈ సినిమా విడుదల కావడంతో అక్కడ కూడా మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
ఇక అల్లు అర్జున్ పారితోషికం విషయంలో కూడా బాగానే ముందున్నాడు.ఈయన భార్య స్నేహ రెడ్డి( Sneha Reddy ) అందరికీ పరిచయమే.
ఈయనకు ఇద్దరు పిల్లలు ఉండగా తన కూతురిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
"""/" /
అయితే ఇదంతా పక్కన పడితే కెరీర్ మొదట్లో అల్లు అర్జున్.
ఎలా ఉండేవాడో అందరికీ తెలిసిందే.అసలు మొదట్లో ఆయన ఫేస్ చేసి చాలామంది విమర్శలు కూడా చేశారు.
దీంతో అల్లు అర్జున్ అవన్నీ తట్టుకోలేక తన ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నాడు.
ఆందుకు ఇప్పుడు చూడటానికి ఒక తీరుగా కనిపిస్తూ ఉంటాడు.అయితే తాజాగా ట్విట్టర్లో అల్లుఅర్జున్ కు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతుంది.
అందులో అల్లుఅర్జున్ చూడటానికి అంత అందంగా కనిపించలేదు.దీంతో ఆ ఫోటో చూసి జనాలు మరోసారి ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.
ప్లాస్టిక్ సర్జరీ ముందు ఇలా ఉన్నాడా అంటూ విమర్శిస్తున్నారు.అచ్చం రోడ్ సైడ్ వర్కర్ లాగా ఉన్నాడు అంటూ కామెంట్ చేయటంతో అల్లు అర్జున్ అభిమానులు వారిపై ఫైర్ అవుతున్నారు.
పుష్ప 3 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన దేవి శ్రీ…. షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడేనా?