అల్లు అర్జున్ బెయిల్ రద్దు ? పోలీసులు ఏం చేయబోతున్నారు ? 

అల్లు అర్జున్ బెయిల్ రద్దు ? పోలీసులు ఏం చేయబోతున్నారు ? 

ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)వ్యవహారం రోజు రోజుకు రచ్చ రచ్చగా మారుతోంది.

అల్లు అర్జున్ బెయిల్ రద్దు ? పోలీసులు ఏం చేయబోతున్నారు ? 

పుష్ప 2(pushpa 2) సినిమా ప్రదర్శనకు అల్లు అర్జున్ వెళ్లడం ,  అక్కడ తొక్కిసలాట చేసుకోవడం,  ఆ ఘటనలో ఒక మహిళ మృతి చెందడం సంచలనం రేపింది .

అల్లు అర్జున్ బెయిల్ రద్దు ? పోలీసులు ఏం చేయబోతున్నారు ? 

ఇక దీనిపై అల్లు అర్జున్(Allu Arjun) పై కేసు నమోదయి ఆయన అరెస్టు అయ్యారు .

బెయిల్ పై బయటకు వచ్చారు.ఇక అక్కడి నుంచి వరుస వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి .

అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)సంచలన వ్యాఖ్యలు చేయడం,  దానికి అల్లు అర్జున్ స్పందించడం,  మీడియా సమావేశం నిర్వహించి ఆ విమర్శలకు గట్టిగానే సమాధానం చెప్పారు .

వీడియోల ద్వారా సంధ్య థియేటర్( Sandhya Theatre) లో ఏం జరిగిందో వివరించారు.

అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని , ఆయన బెయిల్ రద్దు చేయాలని ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు .

దీంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది.అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం ,  థియేటర్ వద్ద తొక్కిసలాట వ్యవహారంపై  సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అనేక విషయాలను వెల్లడించారు .

"""/" / సినీ పరిశ్రమ స్పందించిన తీరు గురించి వివరించారు.బాధిత కుటుంబం గురించి పరిశ్రమ పెద్దలకు పట్టదా అని రేవంత్ రెడ్డి (revanth Reddy)ప్రశ్నించారు.

  సినీ హీరోలకు ప్రత్యేకంగా చట్టం ఉండదని , స్పెషల్ ఇంసెంటివ్ కావాలంటే తీసుకోండి కానీ స్పెషల్ ప్రివిలేజ్ కావాలంటే తాను సీఎం సీట్లో ఉన్నంతవరకు సాధ్యం కాదని రేవంత్ రెడ్డి అన్నారు .

ఈ వ్యాఖ్యలపైనే అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు .ఎవరు తప్పు లేదని తొక్కిసలాట లో మహిళ మృతి చెందిన సమాచారం మరుసటి రోజు వరకు తనకు తెలియదని అల్లు అర్జున్ అన్నారు .

దీనిపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police)ఘటన జరిగాక ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపై పూర్తి ఆధారాలను వీడియోలతో సహా బయటపెట్టారు .

అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు .బెయిల్ (Bail)నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా అల్లు అర్జున్ మాట్లాడారని , వెంటనే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

వాస్తవంగా అల్లు అర్జున్ కు వచ్చేనెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ.

  విచారణలో పోలీసులకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.  జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand)లో ఉన్న అర్జున్ హైకోర్టు ఆదేశాలతో విడుదలైనప్పటికీ , కేసు కు సంబంధించిన విషయాలు బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణుల సైతం పేర్కొంటున్నారు.

ఓరి బాబోయ్.. ఫేస్‌బుక్‌లో రూ.34 వేలకే ఒకటవ ప్రపంచ యుద్ధం నాటి ఓడ కొనేశాడు..

ఓరి బాబోయ్.. ఫేస్‌బుక్‌లో రూ.34 వేలకే ఒకటవ ప్రపంచ యుద్ధం నాటి ఓడ కొనేశాడు..