డాకు మహారాజ్ సినిమాపై ప్రశంసలు కురిపించిన బన్నీ…. నాగ వంశీ పోస్ట్ వైరల్!
TeluguStop.com
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలలో బాలకృష్ణ (Bala Krishna) డాకు మహారాజ్(Daku Maharaj) సినిమా ఒకటి.
డైరెక్టర్ బాబీ(Boby ) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ(Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్లను కూడా రాబట్టినట్టు తెలుస్తుంది.
గత కొద్దిరోజులుగా బాలయ్య వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
"""/" /
ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదలైన డాకు మహారాజ్ సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈ సినిమా పై సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమాపై అల్లు అర్జున్(Allu Arjun) కూడా స్పందించినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ ఏకంగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీకి ఒక బొకే పంపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే అల్లు అర్జున్ ఇలా బొకే పంపించడంతో నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"""/" /
ఈ సందర్భంగా అల్లు అర్జున్ పంపించిన బొకేను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.
మా సినిమా సక్సెస్ అయ్యినందుకు పూల బొకేని పంపి శుభాకాంక్షలు తెలియచేసినందుకు కృతఙ్ఞతలు అంటూ అల్లు అర్జున్ కు స్పెషల్ థాంక్స్ తెలియజేశారు.
ప్రస్తుతం నాగ వంశీ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక పుష్ప 2 సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా సుమారు 500 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకు నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే.
కుబేర సినిమాతో శేఖర్ కమ్ముల పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?