ఫ్లాప్ అవుతాయని తెలిసిన ఆ సినిమాలు చేసిన అల్లు అర్జున్.. కారణం ఏంటంటే?

ఇండస్ట్రీకి చెందిన ఏ నటీనటులు అయినా మంచి సక్సెస్ కోసమే ఎదురు చూస్తారు.

తాము నటించిన సినిమా పక్క హిట్ అవుతుందా లేదా అని టెన్షన్ తోనే ఉంటూ సినిమాలలో నటిస్తారు.

ఇక కొందరు నటీనటులకు తాము నటించే సినిమా ముందే హిట్ అవుతుందని తెలిస్తే వెంటనే మరో విషయం ఆలోచించకుండా ఆ సినిమాలో నటిస్తారు.

కానీ కథ విన్నప్పుడే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా కూడా ఏ నటులు నటించడానికి సిద్ధపడరు.

కానీ ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా అవే సినిమాలు చేశాడట అల్లు అర్జున్.

ఇంతకూ అలా చేయడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.అల్లు అర్జున్ తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలనటుడుగా ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో నటించాడు.ఇక 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా కనిపించాడు.

ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వడంతో ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

తను నటించిన ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు వంటి పలు సినిమాలు మంచి సక్సెస్ ను అందించాయి.

"""/"/ అలా కొన్ని సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలువగా మరికొన్ని సినిమాలు ప్లాప్ లు కూడా అయ్యాయి.

ఓసారి వరుసగా రెండు మూడు సినిమాలు ప్లాప్ అవడంతో బాగా నిరాశ చెందాడు.

ఇక తను నటించిన సినిమాలు ముందే సక్సెస్ కావని అనుకున్నా కూడా నటించాడట.

ఈ విషయాన్ని తనే స్వయంగా తెలిపాడు.గతంలో తాను నటించిన వేదం సినిమా విడుదలయ్యాక ప్రమోషన్ భాగంలో బాగా ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు.

అలా తాను అంతకు ముందు నటించిన సినిమాల గురించి కొన్ని విషయాలు తెలిపాడు.

తను ఆర్య 2 సినిమాలో నటిస్తున్నప్పుడే ఆర్య రేంజ్ లో ఈ సినిమా ఉండదని తనకు తెలుసట.

"""/"/ ఇక వేదం సినిమా ఒప్పుకున్నప్పుడు కూడా గమ్యం స్థాయిని రీచ్ కాలేనని అనుకున్నాడట.

అయినా కూడా ఈ సినిమాలలో చేయడానికి కారణం భవిష్యత్తులో తాను ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు తన వంటూ కొన్ని విభిన్న తరహా సినిమాలు కనిపించాలి కదా అని సైలెంట్ గా సమాధానమిచ్చాడట అల్లు అర్జున్.

"""/"/ ఆ తర్వాత మళ్లీ జులాయి, ఇద్దరమ్మాయిలు, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు మంచి సక్సెస్ ఇచ్చాయి.

ఇక గత ఏడాది విడుదలైన అలా వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్పలో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, టీజర్, సాంగ్స్, ఫస్ట్ లుక్స్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో పలు భాషలలో విడుదల చేయనున్నారు.

ఆ సినిమాలో నన్ను తప్పించి మహేష్ కొడుకుకు ఛాన్స్ ఇచ్చారు.. నిఖిల్ దేవదుల ఏమన్నారంటే?