Allu Arjun Wax Statue : అల్లు అర్జున్ మైనపు విగ్రహం సిద్ధం… ఓపెనింగ్ ఎప్పుడంటే?

పుష్ప సినిమా( Pushpa Movie ) ద్వారా పాన్  ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్( Allu Arjun )క్రేజ్ భారీగా పెరిగిపోయింది అని చెప్పాలి.

ఈయన పుష్ప సినిమాలో నటించినందుకు పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోయింది అంతేకాకుండా ఈ సినిమాలో తన నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా పుష్ప సినిమాతో అందరిని మెప్పించినటువంటి అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.

"""/"/ ప్రపంచ ప్రఖ్యాతి మేడమ్‌ టుస్సాడ్స్‌ ( Madame Tussauds )  మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ( Wax Statue ) ఏర్పాటు చేసే గౌరవాన్ని దక్కించుకున్న అల్లు అర్జున్ ఇటీవల తన విగ్రహ ఏర్పాట్లకు సంబంధించిన కొలతలను కూడా ఇచ్చి వచ్చారు.

అయితే ఇప్పటికే మా ఆయనకు విగ్రహం తయారు చేయడం పూర్తి అయ్యిందని తెలుస్తుంది.

త్వరలోనే ఈ విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.తాజాగా ఆ విగ్రహం ఓపెనింగ్ కి డేట్ అండ్ టైం ఫిక్స్ అయ్యింది.

మార్చి 28న ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయబోతున్నారు. """/"/ ఇక అల్లు అర్జున్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వయంగా అల్లు అర్జున్ దుబాయ్ వెళ్ళబోతున్నారని తెలుస్తోంది.

మార్చి 28 రాత్రి 8 గంటలకు ఈ విగ్రహావిష్కరణ జరగబోతుంది.ఈ న్యూస్ ని దుబాయ్ టుస్సాడ్స్‌ మ్యూజియం( Dubai Madame Tussauds Museum ) నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేయగా.

అల్లు అర్జున్ ఆ పోస్టుని రీ షేర్ చేస్తూ తన అభిమానులకు తెలియజేశారు.

ఇక అల్లు అర్జున్ స్టాచ్యూ ప్రారంభించబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ విగ్రహాన్ని చూస్తామా అని ఎదురు చూడటమే కాకుండా ఈ విగ్రహం ఏ గెటప్ లో ఉండబోతుంది అన్న విషయంపై కూడా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీయార్ వీళ్లలో టాప్ హీరో అతనేనా..?