Allu Arjun Wax Statue : మేడం టుస్సాడ్స్ లో కొలువుదీరిన అల్లు అర్జున్ స్టాచ్యూ.. మైల్ స్టోన్ మూమెంట్ అంటూ?

ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) మైనపు విగ్రహాన్ని దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ ( Madam Tussauds ) మ్యూజియంలో పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈ మైనపు విగ్రహాన్ని( Wax Statue ) అల్లు అర్జున్ ఆవిష్కరించారు.

మార్చ్ 28వ తేదీ రాత్రి 8 గంటలకు అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ క్రమంలోనే ఈ విగ్రహంతో పాటు అల్లు అర్జున్ కలిసి దిగినటువంటి ఫోటోను ఈయన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

"""/" / ఇలా తన స్టాచ్యుతో కలిసి అల్లు అర్జున్ దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈయన చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ రోజు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో వ్యాక్స్ స్టాట్చ్యూ ఆవిష్కరణ జరిగింది.ఇది ప్రతి నటుడికి ఇది మైల్ స్టోన్ మూమెంట్.

ఇదో గొప్పు అనుభూతి అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బన్నీ మెగా ఫాన్స్ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.

"""/" / ఈ విధంగా ఒక తెలుగు నటుడి మైనపు విగ్రహాన్ని ఒక మ్యూజియంలో కొలువు తీర్చడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

ఇక ఇదివరకే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రభాస్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు కానీ దుబాయిలో సౌత్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటి మైనపు విగ్రహంగా అల్లు అర్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం విశేషం.

ఇక పుష్ప సినిమా( Pushpa Movie ) తో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఈ అరుదైనటువంటి గౌరవాన్ని అందుకున్నారు.

ఇక ఇక ఈ పోస్ట్ చూసినటువంటి అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఫోన్ చేసిన బాలయ్య.. అసలేం జరిగిందంటే?