సరిహద్దులో జవాన్ లతో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. పిక్స్ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి అమృత్ సర్ వెళ్లిన విషయం తెలిసిందే.

ఈయన అక్కడ తన భార్య స్నేహ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా గోల్డెన్ టెంపుల్ ను సందర్శించుకున్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.

వీరు సాధారణ భక్తుల మాదిరిగా అక్కడ దర్శించు కున్నారు.ఇక అమృత్ సర్ తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు వాఘా సరిహద్దుకు వెళ్లారు.

ఇండియా - పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం అయిన వాఘా బోర్డర్ దగ్గర అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు.

అక్కడ బిఎస్ఎఫ్ జవాన్ లతో కలిసి అల్లు అర్జున్ భార్య పిల్లలతో ఫోటోలు దిగారు.

ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.వాఘా సరిహద్దు దగ్గర ఈయనకు ఘనమైన స్వాగతం లభించింది.

ఇదంతా ఈయన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కారణంగానే జరిగింది అంటూ చర్చ జరుగుతుంది.

"""/"/ అల్లు అర్జున్ హీరోగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.

పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 పై భారీ అంచనాలే పెరిగాయి.

అందుకే సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.

"""/"/ కాగా పుష్ప 2 సినిమా ఇంకా రెగ్యురల్ షూట్ స్టార్ట్ కాలేదు.

అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో సాయి పల్లవి కూడా కీలక పాత్రలో నటిస్తుంది అని టాక్ వస్తుంది.

సాయి పల్లవి ఈ సినిమాలో గిరిజన యువతి పాత్రలో కనిపించ నుందని.ఇంకా సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా పుష్ప 2 లో భాగం కానుందని టాక్ బయటకు వచ్చింది.

మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

అలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్న రాబిన్ హుడ్ సినిమా.. ఇప్పట్లో విడుదల అయ్యేలా కనిపించడం లేదుగా!