ప్రభాస్, మహేష్ లతో పోటీపై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. నన్ను మించి ఎదిగేటోడు అంటూ?

అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప 2( Pushpa 2 ) విడుదల కావడానికి మరొక 20 రోజులు మాత్రమే సమయము ఉంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారు మూవీ మేకర్స్.

పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ షురూ కాబోతున్నాయి.అప్పుడే బన్నీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.

"""/" / ఈ షోలో భాగంగా ఎన్నో విషయాలకు సమాధానం తెలిపారు అల్లు అర్జున్.

ప్రతి ఒక విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చాలా జెన్యూన్ గా సమాధానాలు ఇచ్చారు బన్నీ.

మిగతా వాటి సంగతి పక్కనబెడితే ఇండస్ట్రీలో నీకు అతిపెద్ద పోటీ ఎవరని అనుకుంటున్నావ్? ప్రభాస్ లేదా మహేశ్ అని హోస్ట్ బాలయ్య ( Balayya )అడగగా.

బన్నీ చాలా లాజికల్‌గా సమాధానం చెప్పాడు.నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే ! ఐ యామ్ మై బిగ్గెస్ట్ కాంపిటీషన్ అంటూ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు అల్లు అర్జున్.

"""/" / ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే ప్రస్తుతం పుష్ప 2 ఉన్న హైప్ చూస్తుంటే ఈ సినిమా పార్ట్ వన్ కి మించి సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది.

ఈ మూవీకి రిలీజ్‌కి వెయ్యి కోట్ల బిజినెస్ జరిగిందని టాక్.ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం ప్రభాస్ తరహాలో భారీ కలెక్షన్స్ రావడం గ్యారంటీ.

అదే టైంలో ప్రభాస్, మహేశ్ ఇద్దరిలో ఎవరు పేరు చెప్పినా సరే ఆయా ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి17, శుక్రవారం 2025