విషాదంలో బన్నీ ఫ్యామిలీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.

కాగా ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ అండ్ ఫ్యామిలీకి అనుకోని విషాదం ఎదురైంది.

అల్లు అర్జున్ మేనమామ రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా బన్నీ ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయారు.

అల్లు అర్జున్ తల్లి నిర్మలకు స్వయానా సోదరుడైన రాజేంద్ర ప్రసాద్ అంటే అల్లు ఫ్యామిలీలో ప్రత్యేక స్థానం ఉంది.

నిర్మలకు పెద్ద సోదరుడైన రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుతో బుధవారం విజయవాడలో తన తుదిశ్వాసను విడిచారు.

ఈ విషయం తెలుసుకున్న అల్లు కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన ఇంటికి తరలివెళ్లారు.

కాగా రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్…