ఆరు ఫైట్లు..మూడు ఈవెంట్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్న బన్నీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకు పోతుందనే చెప్పాలి.

అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు బయట కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ సమయానికి తగ్గట్టుగా పంచ్ లు వేస్తూ అందరిని తన మాటలతో ఆకట్టుకుంటూ ఉంటాడు.

ఇక ఈ మధ్య అల్లు అర్జున్ ఈవెంట్స్ లో బాగా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.

ఒకవైపు పుష్ప సినిమాను ఫారెస్టులో పూర్తి చేస్తూనే మరొక వైపు ఈవెంట్స్ తో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు.

ఇటీవలే అఖిల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు బన్నీ.ఆ ఈవెంట్ లో బన్నీ మాట్లాడిన మాటలు ఇప్పటికే వినిపిస్తూనే ఉన్నాయి.

ఇక ఇప్పుడు నాగ శౌర్య నటిస్తున్న వరుడు కావలెను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శిల్పకళారామం లో జరగనుంది.

ఇక ఈ వేడుకలో చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ మరొక సారి సందడి చేయబోతున్నాడు.

"""/"/ అల్లు అర్జున్ ఇప్పటికే ఆల్ ఓవర్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో.

అందుకే ఈయన గెస్ట్ గా వస్తే సినిమాకు మంచి ప్రమోషన్స్ వస్తాయని చిన్న సినిమాల దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

అందుకే ఆయనను ఒప్పించి చీఫ్ గెస్టులుగా తీసుకు వస్తున్నారు.అంతేకాదు వరుడు కావలెను మేకర్స్ కు బన్నీకి మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రావడానికి ఒప్పుకున్నాడట.

"""/"/ ఇక అల్లు అర్జున్ ఏ ఈవెంట్ కు వెళ్లిన పుష్ప.పుష్ప అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు.

ఆయన ఈవెంట్స్ లో పాల్గొనడం వల్ల ఆయన సినిమాకు కూడా మంచి ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

"""/"/ అందుకే ఆ సినిమాతో పాటు తన సినిమాకు కూడా కలిసి వస్తుందని బన్నీ ఈ మధ్య తరచు కనిపించి సందడి చేస్తున్నాడు.

ఇక బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా కూడా డిసెంబర్ 17న థియేటర్స్ లో రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.

ఆరోజు ఆమె కొట్టడం వల్లే ఇలా తయారయ్యారు.. అనసూయ కామెంట్స్ వైరల్!