అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాకి ఆ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుంటున్నారా..?

అల్లు అర్జున్,( Allu Arjun ) త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు.కానీ మొదటి నుంచి కూడా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు భారీగా వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించి అల్లు అర్జున్ కి మరొక భారీ సక్సెస్ ని అందించాలని తను కూడా పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తోంది.

"""/" / మరి ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోలో సినిమా అంటే దానికి దేవిశ్రీప్రసాద్( Devisri Prasad ) గానీ లేదంటే తమన్( Thaman ) గాని మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక ఇప్పుడు కూడా తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటామని మొదట చెప్పినప్పటికి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోవాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న హరీష్ జయరాజు( Harris Jayaraj ) గా తెలుస్తుంది.

హరీష్ జయరాజు ఒకప్పుడు మంచి మ్యూజిక్ ని ఇవ్వడమే కాకుండా చాట్ బ్లస్టర్ సాంగ్స్ ను ఇచ్చాడు.

ఈ మధ్యకాలంలో ఆయన మంచి మ్యూజిక్ ను ఇవ్వడం లో కొంతవరకు వెనుకబడ్డాడనే చెప్పాలి.

"""/" / మరి ఇప్పుడు మరోసారి అతనిని రంగంలోకి దించబోతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా హరీష్ జయరాజు కనుక ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పాలి.

ఇక ఇప్పటివరకు ఈ సినిమా విషయంలో వీళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అయితే హరీష్ జయరాజు కు తెలుగులో ఇంతవరకు ఒక సక్సెస్ కూడా లేదు.

మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళు అతన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది.

బెల్లం, ల‌వంగాలు క‌లిపి తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?