బన్నీ చేతిమీద టాటూ చూసారా.. దీని వెనుక అసలు రహస్యం ఇదేనట..

సెలెబ్రెటీలకు టాటూస్ వేయించుకునే అలవాటు బాగా ఉంది.ఇందుకు మన తెలుగు స్టార్స్ కూడా అతీతం కాదు.

ఇప్పటికే ఎందరో సెలెబ్రిటీలు తమ ఒంటి మీద టాటూస్ వేయించుకున్నారు.ఈ టాటూస్ ను కొంత మంది స్టైల్ కోసం వేయించుకుంటే మరి కొంత మంది మాత్రం తనకు ఇష్టమైన వారి పేర్లను టాటూస్ రూపంలో వేయించుకుని వారికీ తమ ప్రేమను తెలియజేస్తారు.

మరి తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun )సైతం తన చేతి మీద వేయించుకున్న టాటూ వైరల్ అయ్యింది.

ఇంతకీ ఆ టాటూ ఎవరి పేరు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటనే చర్చ జరుగుతుంది.

అల్లు అర్జున్ వేయించుకున్న టాటూ తన భార్య స్నేహ రెడ్డి( Sneha Reddy ) పేరు అని తెలుస్తుంది.

ఈయన భార్య మీద ప్రేమ ఎంత ఉందో ఈ రూపంలో కూడా చెబుతున్నాడు.

"""/" / ఇక తాజాగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావడంతో ఈయన పేరు మరోసారి మారుమోగి పోయింది.

ప్రజెంట్ అల్లు అర్జున్ ( Allu Arjun ) లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో పార్ట్ పై అన్ని అంచనాలు పెరిగాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 ను మించి తెరకెక్కుతుంది.

"""/" / కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.