టార్గెట్ @90 డేస్… పుష్ప 2 రన్నింగ్ రేస్ మామూలుగా లేదు గా ?

ఆగస్టు 15.ఇదే డేట్ సుకుమార్ పుష్ప 2( Pushpa 2 ) కోసం పెట్టుకున్న టార్గెట్.

సరిగ్గా ఈ డేట్ కి మూడు నెలల సమయం ఉంది.అంటే కేవలం 90 రోజులు.

మరి ఈ డేటుకు సినిమా రావాలి అంటే దానికి సుకుమార్ అండ్ టీం చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే 90 రోజుల సమయం మాత్రమే ఉండగా ఇంకా షూటింగ్ కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది సినిమాలోని కొన్ని సాంగ్స్ బ్యాలెన్స్ ఉండగా ఫహాద్ ఫాజిల్ కి ( Fahadh Faasil ) సంబంధించిన సీన్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి.

మరి ఇంత వర్క్ పెండింగ్ ఉండగా అనుకున్న సమయానికి సినిమా ఎలా రిలీజ్ అవుతుందనేది ప్రస్తుతం చాలామందిని తొలిచి వేస్తున్న ప్రశ్న.

"""/" / పైగా సినిమా విడుదల అయ్యే రోజు వరకు అంటే చివరి నిమిషం వరకు పని చేయడం సుకుమార్ కి( Sukumar ) ఉన్న అలవాటు.

పుష్ప మొదటి పార్ట్ కోసం కూడా ఇలాగే చివరి నిమిషం వరకు పని చేశారు.

మరోవైపు ఇదేమి చిన్న సినిమా కాదు ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి దీనికి సంబంధించిన ప్రమోషన్స్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేయాలంటే ఎంత లేదన్న 40 రోజుల సమయం పడుతుంది.

ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్( Post Production ) చేయాలి.మరోవైపు షూటింగ్ పూర్తి చేయాలి.

ఇవి రెండు దాటుకొని ప్రమోషన్ కి వెళ్ళాలి.ఇలా పీకల లోతుల్లో పుష్ప సీక్వెల్ సినిమా మునిగి పోయింది.

అయినా కూడా సుకుమార్ టాలెంట్ మీద ప్రేక్షకులకి అలాగే అల్లు అర్జున్( Allu Arjun ) అభిమానులకి ఎలాంటి డౌట్ లేదు.

"""/" / ఖచ్చితంగా ఈ సినిమా అంటున్న సమయానికే విడుదలవుతుంది.అందుకోసం సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ ఖచ్చితంగా చాలా కష్టపడి పని చేస్తున్నారు.

సుకుమార్ ప్రస్తుతం చాలా ప్రెషర్ తీసుకుని ప్రతి నిమిషం చాలా ముఖ్యమైనదిగా భావించి సినిమాకి సంబంధించిన పనులు చేస్తున్నారు అలాగే అల్లు అర్జున్ కూడా తన వంతు సహాయం చేస్తున్నాడు ఏది ఏమైనా ఇలాంటి ఒక ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టు సినిమా బయటకు రావాలి అంటే పురిటి నొప్పులు పడినంత బాధ ఉంటుంది అందుకు తగ్గట్టుగానే అన్నీ కూడా సమకూరుతున్నాయి.

అతి త్వరలోనే అనుకున్న సమయానికి అన్ని పూర్తి చేసుకొని, సినిమా థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమవుతుందని నమ్మకంతోనే అంతా ఉన్నారు.

వీడియో వైరల్: నవ్వి..నవ్వి.. పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ.. ప్రాంక్ మాములుగా లేదుగా