పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్ లెక్కలు ఊహకు అందనంత

అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా అక్టోబర్ వరకు షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.

మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

మొదటి భాగం దాదాపుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టిన కారణంగా రెండవ భాగం బడ్జెట్ విషయం లో మైత్రి మూవీ మేకర్స్ అస్సలు ఆలోచించడం లేదు.

ఇప్పటికే 200 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఖర్చు చేశారని.మరో 150 నుండి 200 కోట్ల రూపాయలను ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే పుష్ప 2( Pushpa 2 ) సినిమా ఈ ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా యొక్క బిజినెస్ లెక్కలు అభిమానులకు ఊహ కు కూడా అందనంతగా ఉండబోతున్నాయి అంటూ టాక్‌ వినిపిస్తుంది.

ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 500 కోట్ల రూపాయలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

"""/" / ఈ మధ్య కాలంలో రూ.500 కోట్ల కలెక్షన్స్ అనేది కామన్ గా చూస్తూ ఉన్నాం.

కనుక పుష్ప 2 సినిమా వేయి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కనుక సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ బిజినెస్ రూ.500 కోట్లు ఉండడం పెద్ద ఆశ్చర్యకర విషయం కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా( Social Media ) లో ప్రస్తుతానికి సినిమా యొక్క హడావుడి లేదు.

అయినా కూడా ఈ స్థాయి బిజినెస్ జరగబోతోంది అని చర్చ జరగడం నిజంగా గొప్ప విషయం.

"""/" / సినిమా విడుదలకు రెండు మూడు నెలల నుండి అసలు హడావుడి మొదలు అవ్వబోతుంది.

అప్పుడు సినిమా యొక్క బడ్జెట్ కి తగ్గట్లుగా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం అనుకుంటున్న మొత్తం తో పోలిస్తే మరింత అదనంగా అప్పుడు బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

ఈ సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ కీలక పాత్రలో కనిపించబోతోంది.

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేయనుంది.