సుకుమార్.. అల్లు అర్జున్.. ఆర్య 3..!

సెన్సేషనల్ డైరక్టర్ సుకుమార్ సినిమా అంటే తెలుగు ఆడియెన్స్ లోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉంటాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న సుకుమార్ ఈ సినిమా రెండు పార్ట్ ల తర్వాత అల్లు అర్జున్ తోనే మరో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి.

అసలైతే హ్యాట్రిక్ మూవీ కూడా ఆర్య 3 చేస్తారని అనుకోగా అది కుదరలేదు.

అయితే ఈమధ్యనే ఆర్య 3 కథ సుకుమార్ రాశాడట.పుష్ప రెండు పార్ట్ ల తర్వాత అల్లు అర్జున్ తో ఆర్య 3 చేసే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్.

రీసెంట్ గా ఫ్యాన్స్ తో స్పెషల్ చిట్ చాట్ చేసిన సుకుమార్ ఆర్య 3కి సంబందించిన న్యూస్ లీక్ చేశారు.

పుష్ప రెండు పార్ట్ ల తర్వాత సుకుమార్ తప్పకుండా అల్లు అర్జున్ తో ఆర్య 3 చేస్తారని తెలుస్తుంది.

ఆర్య, ఆర్య 2 ఈ రెండిటిని మించి ఆర్య 3 సినిమా ఉంటుందని అంటున్నారు.

సుకుమార్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా ఎనౌన్స్ చేశారు.

మరి ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియాల్సి ఉంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!