ఇది ఫేవర్ కాదు.. నా బాధ్యత: అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్.
ఈ సినిమాకు శ్రీహర్ష దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో హీరో ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాతో ఆశిష్ హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ధియేటర్ లలో విడుదల కానుంది.
విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఇక ప్రమోషన్స్ లో బాగుందా ఈ చిత్రంలోని డేట్ నైట్ అనే పాటను విడుదల చేసేందుకు తాజాగా ఒక వేడుకను నిర్వహించారు.
ఈ పాటను రిలీజ్ చేయడానికి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు.
ఇక ఈ సినిమాలోని డేట్ నైట్ పాటను అల్లు అర్జున్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.ఈ కార్యక్రమం నాకు ఎంతో మధురమైనది.
ఆర్య సినిమా నా జీవితంలో ఎంతో ముఖ్యమైనదో.అదేవిధంగా సుకుమార్ గారు లేకపోతే ఆర్య సినిమా ఎలా లేదో.
అలాగే నిర్మాత దిల్ రాజు గారు కూడా లేకపోతే ఆర్య సినిమా లేదు అని చెప్పుకొచ్చాడు బన్నీ.
"""/"/
ఆర్య సినిమా షూటింగ్ సమయంలో ఆశిష్, అన్షు, హర్షిత్ వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలు.
షూటింగ్ జరుగుతున్న సమయంలో పక్కన కూర్చునే వాళ్ళు.ఆ సమయంలో వాళ్ళు ఇంత ప్రయోజకులు అవుతారని అనుకోలేదు.
ఇప్పుడు వాళ్ళని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అని అల్లు అర్జున్ తెలిపారు.ఈ ఫంక్షన్‌కి రావడం నేను చేస్తున్న ఫేవర్ కాదు.
నా బాధ్యత.డేట్ సాంగ్ చాలా బావుంది అని తెలిపారు.
ఇక రౌడీ బాయ్స్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.
అనంతరం నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయింది.
ఆ సినిమా టీమ్ కు అభినందనలు తెలపడానికి నాకు సమయం దొరకలేదు.ఇప్పుడు చెబుతున్నాను.
నాని గారు సహా మీ టీమ్ అందరూ అద్భుతంగా చేశారు.డైరెక్టర్ సినిమాను హ్యాండిల్ చేసిన తీరు చాలా బాగుంది అంటూ శ్యామ్ సింగరాయ్ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించాడు బన్ని.
మట్కా కోసం ఇష్టంలేని పనులు కూడా చేశాను.. వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్!