నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది… అల్లు అర్జున్ పోస్టు వైరల్!
TeluguStop.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.
నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో( Pushpa ) పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు.
ఇక ఇటీవల పుష్ప సీక్వెల్ చిత్రం అయిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఈ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఇది మాత్రమే కాకుండా అల్లు అర్జున్ కెరియర్ లో ఎన్నో చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి అలాంటి వాటిలో అలా వైకుంఠపురం ఒకటి.
"""/" /
త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) అల్లు అర్జున్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమాగా అలా వైకుంఠపురంలో( Ala Vaikuntapuramloo ) 2020 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల అయింది.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.అల్లు అర్జున్ పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సరిగ్గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
"""/" /
ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
అలా వైకుంఠపురంలో సినిమా తన హృదయంలో ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుందని తెలిపారు.
ఇలా ఘన విజయాన్ని అందించిన త్రివిక్రమ్, చినబాబు, అల్లు అరవింద్, తమన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజయడమే కాకుండా ఈ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలను కూడా ఈయన అభిమానులతో షేర్ చేసుకున్నారు.
దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.
అక్రమ వలసదారుల ఏరివేత .. యాక్షన్‌లోకి ట్రంప్, గురుద్వారాలలో యూఎస్ ఏజెంట్ల తనిఖీలు