ముఖ్యమంత్రి జగన్ కి కోలుకోలేని షాక్ ఇచ్చిన అల్లు అర్జున్!
TeluguStop.com
స్టార్ హీరోలు కమర్షియల్ యాడ్స్ చెయ్యడం అనేది కొత్తేమి కాదు.ముఖ్యంగా మన టాలీవుడ్ లో అది చాలా కామన్.
అయితే రీసెంట్ గా అల్లు అర్జున్( Allu Arjun ) రెడ్ బాస్ యాప్( Red Bus App ) కోసం చేసిన ఒక యాడ్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా వైసీపీ ఫ్యాన్స్ ఫీల్ అవుతూ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు.
ఈ యాడ్ ని అటు టీడీపీ మరియు జనసేన పార్టీలు మీమ్స్ గా చేసుకొని ఆంధ్ర ప్రదేశ్ లో యువత దుస్థితి ఈ స్థాయిలో ఉంది అంటూ ప్రచారం చేస్తున్నాయి.
గత కొంతకాలం గా అల్లు అర్జున్ రెడ్ బస్ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నాడు.
ముఖ్యంగా కమెడియన్ అలీ తో ఆయన చేసిన యాడ్ కి అప్పట్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అందువల్ల మళ్ళీ అల్లు అర్జున్ తో ఒక కొత్త యాడ్ ని చేసుకొచ్చారు.
"""/" /
ఈ యాడ్ లో ప్రతీ ఆటో వెనుక రెడ్ బస్ పోస్టర్లు అంటించారు.
ఈ పోస్టర్స్ ద్వారా ప్రతీ శుక్రవారం ఇతర ఊర్లలో ఉద్యోగాలు చేసుకునే వారు వీకెండ్స్ లో ఇంటికి రావాలంటే రెడ్ బాస్ యాప్ ని ఉపయోగించి బుక్ చేసుకోండి అనేది ఈ యాడ్ సారాంశం.
అది కాసేపు పక్కన పెడితే యాడ్ ప్రారంభం లో ఆంధ్ర లో ఉద్యోగాలు( AP Jobs ) లేవు కాబట్టి, హైదరాబాద్ కి వెళ్లాల్సి వస్తుంది అనేది చూపిస్తారు.
దీని వల్లనే వైసీపీ అభిమానులు( YCP ) ఫీల్ అవుతున్నారు.టీడీపీ , జనసేన పార్టీలకు అది ఒక ప్రచార అస్త్రం గా మారిందని , అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరో కాబట్టి , ఆయన మామయ్య పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) సపోర్టుగా ఈ యాడ్ చేయించాడని వైసీపీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
లక్షణంగా సినిమాలు చేసుకుంటూ ఉన్నావు అలాగే చేసుకోవచ్చు కదా, నీకు ఎందుకు ఇవన్నీ అంటూ సోషల్ మీడియా లో ఆయన్ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు.
"""/" /
దీనిపై అల్లు అర్జున్ వివరణ ఇస్తాడో లేదో చూడాలి.ఒకవేళ ఆయన వివరణ ఇవ్వకుండా, ఈ యాడ్ జగన్( Jagan ) దాకా వెళ్తే, పవన్ కళ్యాణ్ సినిమాలను ఎలా అయితే తొక్కాడో, అదే విధంగా అల్లు అర్జున్ సినిమాలను కూడా తొక్కుతాడా అని అల్లు అర్జున్ అభిమానులు భయపడుతున్నారు.
అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు ని తెచ్చిపెట్టిన పుష్ప సినిమా( Pushpa ) అన్నీ ప్రాంతాలలో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.
కారణం ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం టికెట్ రేట్స్ పెట్టడం వల్లే.
మళ్ళీ ఆయన సినిమాలకు భవిష్యత్తులో వైసీపీ అధికారం లోకి వస్తే ఇలాంటి పరిస్థితి ఎక్కడ వస్తుందో అని భయపడుతున్నారు ఫ్యాన్స్.
టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదు… బన్నీకి మద్దతు తెలిపిన నటి!