చిరంజీవి అంటే అంత ఇష్టమంటున్న బన్నీ.. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లభిస్తుందా? 

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మెగా అభిమానులు వర్సెస్ అల్లు అర్జున్ అభిమానులు అంటూ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇంతకుముందు బాగానే ఉన్నా అల్లు ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్( Mega Fans ) ఎప్పుడైతే బన్నీ నంద్యాల పర్యటన చేశారు అప్పటినుంచి నిప్పు రాజుకుంది.

ఇక ఆ క్షణం నుంచి మెగా అభిమానులు అల్లు అర్జున్ పై( Allu Arjun ) దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

అయితే మెగా అభిమానుల అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఉన్న గొడవలను ఎంత చల్లార్చాలి అనుకున్నప్పటికీ అవి మాత్రం తగ్గడం లేదు.

దానికి తోడు మెగా హీరోలు చేస్తున్న ఒక్కొక్క ట్వీట్ మాట్లాడుతున్న మాటలు ఆ ఫ్యాన్స్ వార్ ని మరింత పెంచాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో అల్లు అర్జున్ బాలకృష్ణ( Balakrishna ) పోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4లో( Unstoppable Season 4 ) పాల్గొన్న విషయం తెలిసిందే.

ఈ ఫ్యాన్స్ వారి గురించి అల్లు అర్జున్ స్పందిస్తాడని చాలామంది అభిమానులు ఎదురు చూస్తారు.

  దానికి తగ్గట్టే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఇద్దరూ ఫైర్ రెండో ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రస్తావన వచ్చింది.

చాలా గ్యాప్ తర్వాత బన్నీ మావయ్య గురించి కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడాడు.

"""/" / గత ఇరవై సంవత్సరాలుగా తనకు చిరంజీవికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసని, కానీ అంతకు ముందు ఇరవై ఏళ్ళు ఆయనతో తన బాండింగ్ ఎప్పుడు చెప్పుకునే సందర్భం రాలేదు కాబట్టి ఇప్పుడు పంచుకుంటానని అన్నారు.

ఒక మనిషిగా చిరు ఫ్యాన్ అయ్యాకే మెగాస్టార్ కు అభిమానిగా మారానని, బాల్యం నుంచే మావయ్య ప్రభావం నా మీద ఎలా ఉందో ఒక ఉదాహరణ చెప్పాడు.

విదేశీ పర్యటనలు ఖరీదుగా ఉన్న టైంలోనే చిరంజీవి తన పిల్లలతో పాటు బన్నీ, శిరీష్ కలిపి మొత్తం పది మందికి పైగా ఫారిన్ ట్రిప్ కి తీసుకెళ్లిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు.

"""/" / ఇంతమందిని తీసుకెళ్లడాన్ని గొప్పగా వివరించాడు బన్నీ.అంతే కాదు చిరంజీవిని తనతో పాటు చిన్నతనంలో పిల్లలందరూ చికు బాబాయ్ అని పిలుస్తారని చెప్పడం మరో కొత్త సంగతి.

ఇంత కాలం తర్వాత బన్నీ చిరంజీవి గురించి ఇంత డీటెయిల్ గా చెప్పడం మంచి విషయమే.

మరి ఇప్పటికైనా మెగా ఫ్యాన్స్ అల్లు ఫాన్స్ మధ్య వార్ తగ్గుతుందేమో చూడాలి మరి.

ఆ రెండు దేశాలలో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?