ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఈ సినిమాను రెండు పార్టులుగా చేసి రిలీజ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత అసలైతే కొరటాల శివ డైరక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ ఎందుకో వాయిదా పడ్డది.
వేణు శ్రీరాం తో ఐకాన్ మూవీ కూడా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.
ఇదిలాఉంటే మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో అల్లు అర్జున్ మరో సినిమా చేస్తాడని తెలుస్తుంది.
ఆల్రెడీ బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సూపర్ హిట్ కాగా మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ రానుందని తెలుస్తుంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫైనల్ అయినట్టు టాక్.
మహానటి సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తుంది.
ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా కూడా చేస్తుంది.
ఆ సినిమాలో కీర్తి సురేష్ సిస్టర్ రోల్ లో నటిస్తుందని తెలిసిందే.అల్లు అర్జున్ తో కీర్తి సురేష్ మొదటిసారి జోడీ కడుతుంది.
బోయపాటి డైరక్షన్.అల్లు అర్జున్ యాక్షన్ మరోసారి ఈ కాంబో సరైనోడిని మించి సూపర్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.
జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్… మౌనం పాటిస్తున్న తారక్!