'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా'.. ఈ డైలాగ్ వెనుక అంత జరిగిందా?

ప్రముఖ వేడుకల్లో ఒకటైన ఫిలిం ఫేర్ అవార్డ్స్ అంగరంగ వైభవంగా జరిగాయి.ఈసారి కూడా చాలా ప్రతిభావంతులైన నటీనటులు అవార్డులను అందుకున్నారు.

ఇక ఈ వేడుకలో ముఖ్యంగా పుష్ప సినిమా అన్నిటికంటే ఎక్కువ అవార్డులు అందుకున్న విషయం ఇప్పటికే అందరికి తెలుసు.

అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా అన్ని విభాగాల్లో అవార్డులను అందుకుని తగ్గేదేలే అంటూ మరోసారి నిరూపించుకుంది.

అల్లు అర్జున్ హీరోగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.

ఇక ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో ఈ సినిమాకు చాలా అవార్డులు వరించాయి.

దీంతో పుష్ప సినిమా పేరు సోషల్ మీడియాలో మరోసారి మారుమోగి పోయింది.ఇక ఈ వేడుకలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.

ఫైర్ అనే డైలాగ్ ఎలా వచ్చిందో చెప్పుకొచ్చాడు.ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అనేది తెలుసు.

మరి ఆ డైలాగ్ రావడానికి కారణం డైరెక్టర్ హరీష్ శంకర్ అట.ఎలా అనేది కూడా అల్లు అర్జున్ ఈ వేదికపై చెప్పుకొచ్చాడు.

"""/"/ పుష్ప సినిమా స్టార్ట్ చేయడానికి ముందే హరీష్ శంకర్ ను కలిసిన అల్లు అర్జున్ ఈ సినిమా పేరు పుష్ప అని చెప్పాడట.

అప్పుడు పవర్ ఫుల్ స్టోరీకి పుష్ప అనే సాఫ్ట్ టైటిల్ కరెక్టేనా అని హరీష్ డౌట్ రైజ్ చేయగా అదే విషయం బన్నీ సుక్కు ను అడిగారట.

దాంతో వెంటనే సుకుమార్ ఆలోచింది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అనే డైలాగ్ అప్పటికప్పుడే రాశారట.

ఇది ఈ డైలాగ్ రావడానికి కారణం.హరీష్ శంకర్ కు బన్నీ చెప్పకపోయి ఉంటే ఇంత మంచి డైలాగ్ మిస్ అయ్యేవాళ్ళం.

నాగార్జునతో అలాంటి సినిమా తీస్తానని చెబుతున్న అనిల్ రావిపూడి.. ఈ కాంబో సాధ్యమేనా?