మేజర్ ప్రతి భారతీయుడి గుండెను తాకినా సినిమా... మేజర్ పై ప్రశంసలు కురిపించిన బన్నీ!

శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్.

ఈ సినిమా జూన్ 3వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా మొదటి షో తోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా చూసిన ఎంతో మంది ప్రేక్షకులు ఈ సినిమా పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

అదేవిధంగా సినీ ప్రముఖులు సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.తాజాగా ఈ సినిమా వీక్షించిన అల్లు అర్జున్ మేజర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మేజర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సినిమాలో నటించిన అడివి శేష్ అలాగే ఇతర చిత్రబృందం ఎంతో అద్భుతంగా నటించారు.

ఈ సినిమా ప్రతి ఒక్క భారతీయుడు గుండెను తాకేలా ఉంది.డైరెక్టర్ శశికిరణ్ సినిమాని ఎంతో అందంగా మలిచారు.

ఇంత అద్భుతమైన సినిమా అని మనకు అందించిన నిర్మాత మహేష్ బాబుకు కృతజ్ఞతలు అంటూ అల్లు అర్జున్ సినిమా పై స్పందించారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/06/major-movie-ai-shesh-mahesh-babu-shashikiran-thikka!--jpg" / అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ పై అడివి శేష్ స్పందిస్తూ రీ ట్వీట్ చేశారు.

క్షణం సినిమా నుంచి మేజర్ సినిమా వరకు మీరు చూపించిన ప్రేమ అందించిన సపోర్ట్ కు కృతజ్ఞతలు.

ఇక నా పుట్టినరోజు డిసెంబర్ 17న మీరు నాకు పుష్ప సినిమా గిఫ్ట్ ఇచ్చారు.

ఇప్పుడు మేజర్ సినిమా విజయాన్ని మరింత అందంగా మార్చారు అంటూ అడివి శేష్ అల్లుఅర్జున్ ట్వీట్ పై స్పందించారు.

ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతు న్నాయి.

ఈ సినిమాలతో రజినీకాంత్ సూపర్ హిట్ కొడుతాడా..?