నాన్నతో గొడవ గురించి బన్నీ ఏమన్నాడంటే..!

అల్లు అర్జున్‌ గురించిన ఒక వార్త గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

అల్లు అర్జున్‌ మరియు ఆయన తండ్రి అల్లు అరవింద్‌కు మద్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరు కూడా విడివిడిగా వారి వారి వ్యాపారాలు చూసుకుంటున్నారని, తనకు ప్రాముఖ్యత ఇవ్వని కారణంగా బన్నీ తండ్రి నుండి దూరంగా ఉంటున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి.

అయితే తాజాగా అల్లు అర్జున్‌ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని తేల్చి పారేశాడు.

అల్లు అర్జున్‌ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.తమ కుటుంబ సభ్యులం అంతా కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటాం.

నాన్న, నేను ప్రతి రోజు ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూనే ఉంటాం.మేము ప్రతి రోజు సినిమాల విషయం, మీడియాలో వస్తున్న విషయాల గురించి చర్చిస్తాం.

మా ఇద్దరి మద్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలను చూసి నవ్వుకుంటాం అంటూ అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చాడు.

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తండ్రి, కొడుకు సెంటిమెంంట్‌ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు.

మరి ఈ చిత్రం కథ ఏంటీ అంటూ అడిగిన సమయంలో నేను సినిమా గురించి ఇప్పుడేం చెప్పను, త్వరలోనే సినిమాను చూసి ప్రేక్షకులు తెలుసుకోవాలి.

అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రం ఈచిత్రంలో బాగుంటుందని బన్నీ పేర్కొన్నాడు.ఆసక్తికర విషయాన్ని సినిమా విడుదల అయ్యే వరకు రివీల్‌ చేయవద్దని తాము భావిస్తున్నట్లుగా బన్నీ పేర్కొన్నాడు.

మరో బాహుబలి వస్తుందని ప్రకటన చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ అంటూ?