వామ్మో... పుష్ప 2 కోసం భారీగా డిమాండ్ చేస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని కోట్లా?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన సినిమా పుష్ప.

ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయ్యి ఎంతో మంచి క్రేజ్ దక్కించుకుంది.

ఇకపోతే ఈ సినిమాకి సౌత్ లో కన్నా నార్త్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుందని చెప్పాలి.

ఇప్పటికీ నార్త్ ఇండస్ట్రీలో పుష్ప సినిమా మేనియా ఏ మాత్రం తగ్గలేదు.మొన్నటికి మొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం పుష్ప డైలాగు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇక పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు మరికొన్ని కసరత్తులు చేయాల్సి ఉంది.

ప్రతి విషయంలోనూ సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని పార్ట్ వన్ కు మించి అనేలా రూపొందిస్తున్నారు.

ఇకపోతే పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పుష్ప2 కోసం హీరో అల్లుఅర్జున్ భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.

"""/" / పుష్ప సినిమాకి సుమారు 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ పార్ట్ 2 కోసం ఏకంగా 100 కోట్లను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది ఈ క్రమంలోనే తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచారు.

ఇక హీరోయిన్ రష్మిక కూడా పుష్ప సినిమా కోసం రెండు కోట్లు తీసుకోగా ప్రస్తుతం మరొక కోటి రూపాయలు అదనంగా తీసుకుంటోందని సమాచారం.

ప్రస్తుతం సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ లోమార్పులు చేస్తున్నారు త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది.

బఘీర పరిస్థితి ఏంటి..? ప్రశాంత్ నీల్ రాంగ్ టైమ్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారా..?