‘ఆహా’ కోసం బన్నీ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?

తెలుగు కంటెంట్‌ తో ప్రత్యేకంగా వచ్చేసిన ఆహా ఓటీటీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆహా ప్రారంభించి 9 నెలలు అవుతుంది.ఈ 9 నెలల్లో ఎక్కువ శాతం కరోనా వల్ల లాక్‌ డౌన్‌ లో ఉన్న కారణంగా కంటెంట్‌ విషయంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయారు.

గత రెండు నెలలుగా హడావుడి కనిపిస్తుంది.త్వరలోనే ఆహాలో మరిన్ని షోలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా భారీ ఈవెంట్‌ ను నిర్వహించి ప్రకటించిన విషయం తెల్సిందే.

ఇక ఆహా కు మొన్నటి వరకు విజయ్‌ దేవరకొండ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించాడు.

అయితే ఇప్పుడు ఆయన స్థానంలో అల్లు అర్జున్‌ రంగంలోకి దిగాడు.అల్లు అర్జున్‌ తో ఇప్పటికే యాడ్‌ ను షూట్‌ చేసి విడుదల చేశారు.

"""/"/ ఆహాను ప్రమోట్‌ చేసేందుకు బన్నీ ఏకంగా అయిదు కోట్ల పారితోషికంను అందుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

అదేంటి అల్లు అరవింద్‌ దే కదా ఆహా దానికి బన్నీ పారితోషికం అందుకోవడం ఏంటీ అనుకుంటున్నారా.

ఆహా అనేది కేవలం అల్లు వారిది మాత్రమే కాదు.ఆహాలో మైహోమ్స్‌ వారు మరియు దిల్‌ రాజు కూతురు అల్లుడు కూడా పెట్టుబడి పెట్టారు.

కనుక అల్లుడు అల్లుడే పేకాట పేకాటే అన్నట్లుగా తమదే అనే భావన ఉన్నా కూడా ఇతరులు కూడా పార్ట్‌ అయ్యి ఉన్నారు కనుక ఖచ్చితంగా బన్నీ పారితోషికం అందుకుంటున్నాడు.

సాదారణంగా బన్నీ ఏదైనా బ్రాండ్‌ కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తే ఎంత పారితోషికం తీసుకుంటాడో అంతే ఆహాకు కూడా అందుకున్నాడు.

వచ్చే ఏడాది దీపావళి వరకు కూడా బన్నీ ఆహా కోసం ప్రమోటర్‌ గా వ్యవహరించబోతున్నాడు.

బన్నీ ప్రమోషన్‌ తో ఆహా మరింతగా సక్సెస్‌ అవుతుందో లేదో చూడాలి.

సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??