భరించలేకపోతున్నాను.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్!
TeluguStop.com
పుష్ప 2( Pushpa 2 ) తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్( Allu Arjun ) వివాదంలో చిక్కుకున్నారు.
ఈయన ప్రమేయం ఏమాత్రం లేకపోయినా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని, ఈ తొక్కిసలాటలో రేవతి అనే అభిమాని మరణించడంతో ఏకంగా ఈయనపై కేసులు నమోదు కావడం జైలుకు కూడా వెళ్లి రావడం జరిగింది.
ఇక అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు రాగానే సినిమా సెలబ్రిటీలందరూ కూడా వరుసగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనని పరామర్శించారు.
అదేవిధంగా తెలంగాణ సర్కార్ వ్యవహార శైలిని సినీ ఇండస్ట్రీ మొత్తం తప్పు పట్టింది.
"""/" /
ఈ విధంగా సినీ సెలబ్రెటీలందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి తనని పరామర్శించి రావడంతో ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అసెంబ్లీలో ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్ కు కాలు పోయిందా, చెయ్యి పోయిందా, ఏమైనా కిడ్నీలు పాడైపోయాయా.
ఆయన ఒకరోజు జైలులో ఉండి బయటకు రాగానే సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా తనని పరామర్శించడానికి వెళ్లారు.
కానీ హాస్పిటల్లో ఉన్న ఆ బాబుని చూడటానికి ఒక్కరైనా వచ్చారా అంటూ ప్రశ్నించారు.
ఆయన అలా రోడ్డు షో చేయకుండా వచ్చి ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదు కదా అంటూ అల్లు అర్జున్ ని పూర్తిస్థాయిలో తప్పు పట్టారు.
"""/" /
ఈ విధంగా అల్లు అర్జున్ గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తీరు పట్ల అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తన వ్యక్తిత్వాన్ని కించపరడాన్ని భరించలేకపోతున్నట్లు తెలిపారు.
ఒకప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులను పరామర్శించడం కోసం నేను ఎంతో దూరం వెళ్ళాను అలాంటిది నా అవమానులు గాయపడితే బాధపడనా అంటూ ప్రశ్నించారు.
తొక్కిసలాట ఘటన మరుసటి రోజు వరకు తనకు తెలీదన్నారు.ఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలనుకున్నానని చెప్పారు.
కానీ, అక్కడికి రావొద్దని పోలీసులు సూచించారని, శ్రీ తేజ్( Sritej ) హాస్పిటల్లో ఉన్నారని తెలిసి నా మనుషులను అక్కడికి పంపించాను.
ఈ బాధతో తాను సక్సెస్ మీట్ కూడా నిర్వహించలేదనీ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బన్నీ ఘాటుగా స్పందించారు.
‘ఇది దేశమా? లేక చెత్త కుప్పా?’ భారత్‌ను అవమానించిన బ్రిటీష్ టూరిస్ట్!