ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్… ఎమోషనల్ అయిన ఫ్యామిలీ మెంబర్స్…
TeluguStop.com
ఇక ఎట్టకేలకు అల్లు అర్జున్( Allu Arjun ) తన ఇంటికి చేరుకున్నాడు.
తన పిల్లల్ని ఫ్యామిలీని పట్టుకుని ఎమోషనల్ అయినట్టుగా కూడా తెలుస్తోంది.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
కానీ అనుకోకుండా ఇలాంటి కొన్ని సంఘటనలు జరగడంతో ఆయన జైలుకు వెళ్తున్నాడు అంటూ కొన్ని వార్తలు కూడా రావడం మళ్ళీ హైకోర్టు నుంచి అతనికి బెయిల్ రావడం అనేది హుటాహుటిన జరిగిపోయాయి.
ఇక మొత్తానికైతే ఆయన తన ఇంటికి చేరుకొని మీడియాతో మాట్లాడాడు. """/" /
సంధ్య థియేటర్లో( Sandhya Theater ) జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది.
దానికి నేను కూడా చింతిస్తున్నాను అంటూ ఆయన ఆ సంఘటన గుర్తు చేసుకొని బాధపడ్డాడు.
ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతన్ని హత్తుకొని ఎమోషనల్ అయ్యారు.ఇక అలాగే అతనికి దిష్టి కూడా తీశారు.
ఇక పాన్ ఇండియా సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
"""/" /
ఇక ఇప్పుడు పుష్ప 2 భారీ కలెక్షన్లను సాధిస్తున్న వేళ సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం అనేది అతని కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ ను కూడా విపరీతమైన ఆందోళనకు గురిచేసింది.
ఇక ఏది ఏమైనా కూడా ఆయన క్షేమంగా ఇంటికి రావడం అలాగే అతనికి మధ్యంతర బేయిల్ ని హైకోర్టు జారీ చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగిస్తుంది.
మరి ఈ కేసు ఎక్కడ దాకా వెళుతుందనే విషయాలు ఇంకా బయటికి రాలేదు.
కానీ మొత్తానికైతే ఈ కేసు తొందర్లోనే ముగియబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక లాయర్ నిరంజన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ కి బెయిల్ తెప్పించడంలో చాలా వరకు కృషి చేశాడు.
ఆయన కష్టం వల్లే అల్లు అర్జున్ కి బెయిల్( Allu Arjun Bail ) వచ్చింది.
లేకపోతే ఇప్పటికి అల్లు అర్జున్ 14 రోజుల పాటు రిమాండ్ లో ఉండేవాడు అంటూ అతని అభిమానులు కూడా నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఇక ఇది ఏమైనా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మీకు ఇదేం సరదా రా బాబు.. కాస్త అటు ఇటు అయితే ప్రాణాలు గాల్లోకె..