సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులకు పక్కా ఆధారాలు.. బన్నీ కెరీర్ కు ఇబ్బందేనా?

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట( Sandhya Theatre Stampede ) ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది.

అందులో భాగంగానే తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అల్లు అర్జున్‌ కు( Allu Arjun ) పోలీసులు స్టేషన్‌ కు పిలిచి విచారణ చేపట్టారు.

అల్లు అర్జున్ బెయిల్( Bail ) రద్దు విషయాన్ని పోలీస్ శాఖ సీరయస్‌ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

అయితే ఈ సారి హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్‌ను సవాల్ చేస్తూ.సుప్రీం కోర్టుకు( Supreme Court ) వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ యాక్టివిటీ ఉందంటూ పోలీస్ శాఖ భావిస్తోంది.అందుకే సీసీటీవీ ఫుటేజీ, ఘటన జరిగిన రోజు దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరిస్తోందట పోలీస్ విచారణ బృందం.

"""/" / ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ కు మరోసారి పోలీసులు విచారణ జరపడం ఆసక్తికరంగా మారింది.

అయితే సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో పోలీసులు సీరియస్‌ యాక్షన్‌ కు దిగుతున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా అల్లు అర్జున్‌ ను మరోసారి పోలీస్ స్టేషన్‌ కు పిలిపించి విచారణ చేపట్టారు.

అయితే ఏయే అంశాలపై స్టేట్‌ మెంట్‌ రికార్డు చేస్తారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఆల్రెడీ మధ్యంతర బెయిల్‌ పై ఉండటంతో జనవరి 21 వరకైతే అరెస్ట్‌ ఛాన్స్‌ లేదు.

కానీ బెయిల్‌ రద్దుపై ఫోకస్‌ పెట్టారు పోలీసులు.ప్రత్యేకించి బెయిల్‌ రూల్స్‌ కు విరుద్ధంగా అల్లు అర్జున్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టారనేది పోలీసుల వాదన.

"""/" / అంతేకాదు సంధ్య థియేటర్‌ కి వెళ్లొద్దని చెప్పినా వెళ్లారని ఆధారాలను వీడియోలను బయట పెట్టారు.

ఇక ప్రెస్‌మీట్‌ లో అల్లు అర్జున్ చెప్పిన అంశాల ప్రాతిపదికగా ప్రశ్నలు సిద్ధం చేశారట.

మొత్తంగా చూసుకుంటే ఈ విషయం పట్ల ప్రభుత్వం అలాగే పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

దీంతో చివరికి ఏం జరుగుతుంది అల్లు అర్జున్ కెరీర్ ప్రాబ్లం లో పడుతుందా? బన్నీ కేరిర్ కు ఇబ్బంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. కొత్త ఆలోచనతో చేపలను ఎంత సులువుగా పట్టేస్తున్నారో