పుష్ప ట్రైలర్ టీజ్.. శాంపిలే ఇలా ఉందంటే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ పుష్ప.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ కూడా చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టేశాడని తెలుస్తుంది.

ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా లేటెస్ట్ గా ట్రైలర్ కు సంబందించిన టీజ్ ఒకటి రిలీజ్ చేశారు.

అంటే ట్రైలర్ ఎలా ఉంటుంది అన్నది ఓ శాంపిల్ చూపించారన్నమాట.స్టార్ట్ టు ఎండింగ్ ఆ కట్ షాట్స్ చూస్తుంటే పుష్ప బన్నీ స్టామినా ఏంటన్నది ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో చూపించేలా ఉన్నాడు.

ఈ సినిమా కూడా మాస్ ఆడియెన్స్ కు జాతర కలిగించేలా ఉంటుందని అనిపిస్తుంది.

మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప.ఇక ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 6న రిలీజ్ ఫిక్స్ చేశారు.

డిసెంబర్ 17న పుష్ప పార్ట్ 1 రిలీజ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

ఐకాన్ స్టార్ గా పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.

Viral : కోతుల దెబ్బకి గోరిల్లాలా మారిన గ్రామ పంచాయతీ కార్యదర్శి.. అసలు మ్యాటరేంటంటే…?!