మరో ఆన్ లైన్‌ ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్న అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్‌ గా రూపొందిన పుష్ప సినిమా 300 కోట్ల కు పైగా వసూళ్లు సాధించింది.

గత ఏడాది విడుదల అయిన ఈ సినిమా ఈ ఏడాది లో కూడా కుమ్మేస్తుంది.

ఈ వీకెండ్‌ కు కూడా పుష్ప బాక్సాఫీస్‌ వద్ద మరో పది పదిహేను కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో సినిమా ను అమెజాన్ ప్రైమ్‌ లో ఈనెల 7 ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు కాని ఖచ్చితంగా ఓటీటీ లో ఈవారమే వస్తుందట.

ఎందుకంటే ఈ సినిమా ను అమెజాన్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేశారు.

ఇప్పటికే థియేటర్‌ రన్‌ ద్వారా 300 కోట్లకు పైగానే వసూళ్లు నమోదు అయ్యాయి.

కనుక ఇకపై షేర్‌ వచ్చేది లక్షల్లోనే ఉంటుంది.మొత్తం కలిసి షేర్‌ కోటి కూడా రాకపోవచ్చు అనేది మైత్రి వారి ఆలోచన.

అందుకే అమెజాన్ వారిని వాయిదా వేయమని చెప్పేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి.

పుష్ప సినిమా హిందీ వర్షన్‌ లేదు అన్నప్పుడు అభిమానులు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్‌ చేసి సినిమా ను ఉత్తరాదిన విడుదల అయ్యేలా చేశారు.

"""/" / ఇప్పుడు అక్కడ 60 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి అంటే ఖచ్చితంగా అభిమానుల హడావుడి అనడంలో సందేహం లేదు.

ఇప్పుడు అమెజాన్ లో విడుదల వాయిదా వేయాలంటూ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.మేకర్స్ ఈ డిమాండ్‌ ను కూడా పట్టించుకుంటారా అనేది చూడాలి.

ఒక వేళ మైత్రి వారు మొండిగా అమెజాన్ లో స్ట్రీమింగ్‌ మొదలు పెడితే అప్పుడు బన్నీ అభిమానుల రియాక్షన్‌ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి.

తప్పుడు కథనాలు నమ్మొద్దు..: నటుడు శ్రీకాంత్