అరుదైన రికార్డ్‌ కు రూ.5 కోట్ల దూరంలో హిందీ 'పుష్ప'

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

బన్నీ పుష్ప తో తెలుగు రాష్ట్రాల్లో మరియు కేరళ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడు కాని.

ఉత్తరాదిన మరియు తమిళనాట ఈ సినిమా వసూళ్లను దక్కించుకోవడం కష్టం అంటూ అంతా అనుకున్నారు.

పుష్ప విడుదల అయిన రోజున ఉత్తరాదిన సినిమా వసూళ్లు చాలా నార్మల్ గా వచ్చాయి.

కొన్ని చోట్ల కనీసం 10 శాతం ఆక్యుపెన్సీ కూడా రాలేదు అనే వార్తలు వచ్చాయి.

బన్నీ సినిమా లకు అంత సీన్ లేదు అంటూ కొందరు ఆ సమయంలోనే విమర్శలు చేశారు.

విమర్శలను ఎదుర్కొన్న పుష్ప హిందీ వర్షన్‌ ఇప్పుడు అరుదైన రికార్డు కు సిద్దం అయ్యింది.

పుష్ప సినిమా హిందీ వర్షన్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. """/" / ఇప్పటి వరకు ఈ సినిమా 45 కోట్ల కు పైగా వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది.

మరో అయిదు కోట్ల వసూళ్లను రాబడితే 50 కోట్ల వసూళ్లు ఉత్తరాదిన దక్కించుకున్న సినిమాల్లో ఒకటిగా పుష్ప నిలవబోతుంది.

భారీ ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమాను అక్కడి అభిమానులు థియేటర్లలో ఇంత స్థాయిలో చూస్తారని ఎవరు ఊహించలేదు.

ఒక మంచి సినిమా అంటూ రివ్యూలు దక్కడంతో మెల్ల మెల్లగా అక్కడ వసూళ్లు పుంజుకున్నాయి.

కేరళలో ఈ సినిమా 15 కోట్ల వసూళ్లు రాబట్టింది.తమిళ నాట 10 కోట్ల వసూళ్లు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

మొత్తానికి పుష్ప సినిమా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా మంచి వసూళ్లను దక్కించుకోవడం ఆనందం కలిగించే విషయం అంటూ బన్నీ అభిమానులు అంటున్నారు.

అల్లు అర్జున్‌ ఈ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా నిలిచినట్లే అంటున్నారు.

లావణ్య చేసిన పనికి విమర్శలపాలైన అత్తమ్మాస్ కిచెన్.. ఏం జరిగిందంటే?