వేలిముద్రలు కాదంటున్న పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

బన్నీ సరికొత్త మాస్ లుక్‌లో నటిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌పై అనేక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

కాగా ఈ సినిమా టైటిల్‌పై వేలుముద్రలు ఉన్నట్లు, ఇవి సినిమా కథలో చాలా కీలకం కానున్నాయని పలువురు అంచనా వేస్తున్నారు.

అయితే ఆ పోస్టర్‌లో ఉన్నవి వేలిముద్రలు కావని, చెట్టును మధ్యలో నరికితే ఏర్పడే గుర్తులు అని తెలుస్తోంది.

ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండటంతో, ఈ పోస్టర్‌లో దానికి చిహ్నంగా ఈ గుర్తులు చూపించారని తెలుస్తోంది.

మొత్తానికి సుకుమార్ క్రియేటివిటీకి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ముగ్ధులవుతున్నారు.బన్నీ ఊరమాస్ లుక్‌లో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాను 2021 ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

వైరల్ వీడియో: కేవలం లోదుస్తులు ధరించి పబ్లిక్ బస్సు ఎక్కిన యువతి.. చివరకు..?!