సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న 'పుష్ప' బైక్ మీమ్స్!
TeluguStop.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా కోసం అభిమానులు అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి వరుస అప్డేట్ లు విడుదల చేస్తున్నారు.
ఇటీవలే రష్మిక మందన్న శ్రీవల్లి లుక్ రివీల్ చేయగా రెండు రోజుల క్రితం శ్రీవల్లి పాటను కూడా రిలీజ్ చేసారు.
ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ ఎంత రికార్డ్ క్రియేట్ చేసిందో.ఇప్పుడు దాని కంటే శ్రీవల్లి సాంగ్ మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఇక దేవి శ్రీ ప్రసాద్ చాలా రోజుల తర్వాత తన మార్క్ మ్యూజిక్ తో శ్రీవల్లి సాంగ్ ను ఎక్కడికో తీసుకు వెళ్ళాడు.
ఈ సినిమాకు సిద్ శ్రీరామ్ వాయిస్ కూడా చాలా ప్లస్ అయ్యింది. """/"/ అయితే శ్రీవల్లి పాటపై సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.
ఈ పాటలో బన్నీ రాయల్ ఎంఫీల్డ్ బుల్లెట్ బైక్ మీద కూర్చుని కనిపిస్తాడు.
అయితే ఇప్పుడు ఈ బైక్ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అల్లు అర్జున్ కూర్చుని ఉన్న బుల్లెట్ బైక్ నంబర్ ప్లేట్ ను జూమ్ చేసి మరి అభిమానులు చూస్తున్నారట.
"""/"/
అలా అల్లు అర్జున్ కూర్చుని ఉన్న బుల్లెట్ బైక్ నంబర్ జూమ్ చేయగా.
AP03L 5288 అని కనిపిస్తుందట.ఆ నుంబర్ ను చలాన్ ఉందో లేదో అని ఎంటర్ చేసి చూడగా.
'నో పెండింగ్ చాలాన్స్' అని చూపిస్తుందట.ఈ విషయంపై మీమ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
మీరు కూడా సోషల్ మీడియాలో ఆ మీమ్స్ చూసి ఎంజాయ్ చేయండి.
సోదరి కళ్ల ముందే తమ్ముడు అదృశ్యం.. వీడియో వైరల్