అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా యొక్క హిందీ రైట్స్ కు ఉన్న డిమాండ్ ఎంతో తెలుసా!
TeluguStop.com
అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో మైత్రి మూవీస్ మేకర్స్ వారు నిర్మించిన పుష్ప సినిమా హిందీ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
హిందీ లో కనీసం ప్రమోషన్ చేయకుండా పుష్ప సినిమా ను విడుదల చేసి ఏకంగా రూ.
100 కోట్లకు పైగా అక్కడ నుండి కలెక్షన్స్ రాబట్టిన మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పుడు అక్కడ భారీ ఎత్తున పుష్ప 2 ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశం తో ఉన్నారట.
అందుకే హిందీ లో ఎక్కువగా థియేటర్ నెట్వర్క్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాతలకి పుష్ప సీక్వల్ యొక్క డబ్బింగ్ రైట్స్ ఇవ్వాలని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
పుష్ప సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ ని బాలీవుడ్ నుండి రాబట్టిన విషయం తెలిసిందే.
కనుక సీక్వెల్ యొక్క బిజినెస్ అదే స్థాయిలో జరగడం ఖాయం.కచ్చితంగా సీక్వెల్ కూడా రూ.
100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబడుతుందని మేకర్స్ చాలా ధీమా తో ఉన్నారు.
"""/"/
అందుకే బాలీవుడ్ నుండి కాస్త ఎక్కువ మొత్తాన్ని రాబట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బాలీవుడ్ లో పుష్ప 2 యొక్క డబ్బింగ్ రైట్స్ కనీసం రూ.
50 నుండి రూ.60 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అదే నిజమైతే చాలా మంది సౌత్ స్టార్ హీరోల కంటే కూడా ఎక్కువగా అల్లు అర్జున్ సినిమా బిజినెస్ చేసినట్లు అవుతుంది.
మరో వైపు పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో మరియు ఇతర భాషల్లో కూడా భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
"""/"/ ప్రస్తుతానికి ఉన్న బజ్ నేపథ్యం లో పుష్ప 2 సినిమా విడుదలకు ముందే రూ.
500 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన కొందరు మాట్లాడుకుంటున్నారు.
ఈ సినిమా లో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేసే అవకాశాలు ఉన్నాయట.
బాలయ్య, వెంకటేష్ ఫ్యాన్స్ ఆ విషయంలో అసంతృప్తి తో ఉన్నారా..?