ఆహా కోసం అల్లు అర్జున్‌ మరో అడుగు

ఆహా కోసం అల్లు అర్జున్‌ మరో అడుగు

అల్లు అర్జున్‌ ఇటీవలే ఆహా ఓటీటీ కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ఆహా కోసం అల్లు అర్జున్‌ మరో అడుగు

ఆహా కోసం ఆయన పబ్లిసిటీ అందించడంతో పాటు కంటెంట్‌ను కూడా చేందుకు ముందుకు వచ్చాడు.

ఆహా కోసం అల్లు అర్జున్‌ మరో అడుగు

ప్రస్తుతం బన్నీ ఆధ్వర్యంలో ఒక టీం కథలు వింటున్నారట.పాతిక లక్షల నుండి కోటిన్నర వరకు వెబ్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌ లను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తం పది కోట్ల బడ్జెట్‌ ను కేటాయించిన బన్నీ అర్హ ప్రొడక్షన్స్‌ అంటూ ప్రారంభించి వరుసగా వెబ్‌ సిరీస్‌ మరియు వెబ్‌ మూవీస్ లను నిర్మించాలని భావిస్తున్నాడట.

పది ప్రాజెక్ట్‌ లను 2021లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఈ విషయం ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.బన్నీకి పది కోట్ల బడ్జెట్‌ పెద్ద సమస్య కాదు.

ఇలాంటి సినిమాలను నిర్మించడం వల్ల మంచి పేరు కూడా వస్తుందని అంటున్నారు.ఇప్పటికే అల్లు వారికి గీతా ఆర్ట్స్‌ మరియు గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లు ఉన్నాయి.

ఈరెండు కూడా పెద్ద చిన్న సినిమాలను నిర్మిస్తున్నాయి.జీఎ2 ను బన్నీ వాసు చూసుకుంటున్నాడు.

ఇప్పుడు బన్నీ ఏర్పాటు చేయబోతున్న అర్హ బ్యానర్‌ కు సంబంధించిన విషయాన్ని కూడా బన్నీ వాసు చూసుకుంటాడని తెలుస్తోంది.

కొత్త దర్శకులు మరియు కొత్త రచయితలను ఆహ్వానించడం నిజంగా అభినందనీయం.ఎంతో మంది ప్రతిభ ఉన్న వారు ఉన్నారు.

వారికి బన్నీ వంటి వారు ఆఫర్లు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా వారి జీవితాల్లో అద్బుతాలు నమోదు అవుతాయి.

అందుకే ఖచ్చితంగా బన్నీ అర్హ బ్యానర్‌ లో చిన్న వారికి ఆఫర్లు ఇవ్వాలంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

ఈ విషయాన్ని బన్నీ అతి త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు.బన్నీ 2021లో ఆహాలో పది వెబ్‌ సిరీస్‌ మరియు సినిమాలను స్ట్రీమింగ్‌ చేస్తే ఖచ్చితంగా రికార్డుగా చెబుతున్నారు.

వార్టన్ స్కూల్‌లో భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌కు కీలకపదవి!

వార్టన్ స్కూల్‌లో భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌కు కీలకపదవి!