ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌ సమర్పించు 'ఆహా 2.0' ఏమై ఉంటుంది

తెలుగు ప్రేక్షకుల కోసం పుట్టిన ఆహా ఓటీటీ అతి తక్కువ సమయంలోనే చాలా చాలా పెద్ద సక్సెస్ ను దక్కించుకుంది.

ప్రముఖ స్టార్స్ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ ఇంకా షో లు ఆహా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి.

అద్బుతమైన కంటెంట్ ఇస్తూ వస్తున్న ఆహా నెక్ట్స్‌ లెవల్‌ కు వెళ్తుందట.ఈ విషయాన్ని ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించారు.

ఆహా 2.0 అంటూ జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఆహా 2.0 ను అల్లు అర్జున్ సమర్పించబోతున్నాడు.

ప్రత్యేకమైన అంశాలు ఎన్నో ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తుందని దీని గురించి కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం వేరే భాషల్లోకి కూడా ఆహా వెళ్లబోతుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రేపు అల్లు అర్జున ముఖ్య అతిథిగా భారీ ఎత్తున అంచనాల నడుమ ఆహా 2.

0 కు సంబంధించిన ఈవెంట్ జరుగబోతుంది.అల్లు అరవింద్‌ ప్రధాన వ్యక్తిగా ఆహా ప్రారంభం అయ్యింది.

తెలుగు ఎంటర్ టైన్ మెంట్‌ రంగంలో సరికొత్త అడుగులు ఈ ఓటీటీ మొదలు పెట్టింది అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రముఖ ఓటీటీ కు గట్టి పోటీ ఇవ్వడం కోసం ఆహా వారి నుండి మరిన్ని వెబ్‌ సిరీస్ లు మరియు టాక్‌ షో లు పెద్ద సినిమాలు రాబోతున్నాయి.

అందుకే ఈవెంట్ ను ఏర్పాటు చేసి మరీ ఆ విషయాన్ని ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

"""/"/ ముఖ్యంగా బాలయ్య టాక్ షో కు సంబంధించిన విషయాన్ని అల్లు అర్జున్ ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆహా వారు రెగ్యులర్‌ గా ఇక నుండి అవార్డుల వేడుక నిర్వహించాలని భావిస్తోంది.

అందుకోసం కూడా బన్నీ ఈ ఈవెంట్ లో ప్రకటన చేస్తాడని సమాచారం అందుతోంది.

మొత్తానికి ఆహా 2.0 ఈవెంట్ అందరి కి చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇక బన్నీ పుష్ప సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.ఇటీవల వచ్చిన మూడు పాటలు కూడా సినిమా స్థాయిని పెంచిన విషయం తెల్సిందే.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

విదేశాల నుంచి ఆదాయమే లక్ష్యం .. కొత్త డిపార్ట్‌మెంట్‌ను సృష్టించిన డొనాల్డ్ ట్రంప్