రచ్చ గెలిచి ఇంట గెలవలేదుగా.. ఎన్టీఆర్, బన్నీలకు ఒకే సమస్య ఎదురైందా?

స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ,ఆర్ఆర్ఆర్ ( Young Tiger Jr.

NTR, RRR )సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ఈ సినిమా ద్వారా చరణ్, ఎన్టీఆర్ లకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెరగడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం తారక్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి.భవిష్యత్తు సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంది.

అయితే స్టార్ హీరో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కు వరుసకు బాబాయ్ అయినా బాలయ్య నోటి వెంట జూనియర్ ఎన్టీఆర్ పేరు రాదు.

అన్ స్టాపబుల్ షోకు ( Unstoppable Show )భవిష్యత్తులో సైతం జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ ఎప్పుడూ బాలయ్యకు కానీ టీడీపీకి ( TDP )కానీ వ్యతిరేకంగా వ్యవహరించలేదు.

బాలయ్య, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కు కారణమేంటో కూడ తెలియడం లేదు. """/" / మరోవైపు బన్నీ( Bunny ) సైతం దాదాపుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

గతంలో ఒక సందర్భంలో చెప్పను బ్రదర్ అని కామెంట్ చేయడం గమనార్హం.ఆ కామెంట్ వల్ల మెగా ఫ్యాన్స్ బన్నీకి దూరమయ్యారు.

బన్నీ సంధ్య థియేటర్ వివాదంలో చిక్కుకున్న సమయంలో సైతం మెగా హీరోల నుంచి బన్నీకి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభించలేదనే సంగతి తెలిసిందే.

"""/" / జైలు నుంచి విడుదలైన తర్వాత బన్నీ మెగా హీరోలను( Mega Heroes ) కలిసినా బన్నీకి, మెగా హీరోలకు గ్యాప్ ఉందని స్పష్టమవుతోంది.

తమ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన హీరోలు ఇంట మాత్రం గెలవలేకపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్, బన్నీ ప్రస్తుతం ఒకే తరహా పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండటం కొసమెరుపు.ఎన్టీఆర్, బన్నీ సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఈ కామెంట్ల గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.