Allu Arjun: పిలకేసి కొత్త లుక్ లోకి మారిపోయిన అల్లు అర్జున్.. పుష్ప2 కోసమే అలా చేశాడంటూ?
TeluguStop.com
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతోంది.
తాజాగా జరిగిన 69వ జాతీయ చలనా చిత్ర అవార్డులలో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్( Allu Arjun ) దక్కించుకోవడంతో టాలీవుడ్ హీరోలను ఎవరు సాధించిన ఒక అరుదైన ఘనతను సాధించి రికార్డు సృష్టించారు.
పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు గెలుచుకున్నారు.
దీంతో రాజకీయ నాయకులు టాలీవుడ్ సెలబ్రిటీలు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
"""/" /
ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ సాధించిన ఘనతకు మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) బ్రహ్మానందం లాంటి పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇంటికి పిలిపించి మరీ పూలమాలతో సత్కరిస్తున్నారు.
ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ ఆహా ఆఫీస్ ని సందర్శించారు.
ఈ నేపథ్యంలో ఆహా ఉద్యోగులు అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
అయితే అల్లు అర్జున్ లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది.ఆహా ఆఫీస్ కి అల్లు అర్జున్ స్టైలిష్ గా బ్లాక్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చాడు.
పుష్ప సినిమా కోసం బన్నీ కొంచెం జుట్టు పెంచిన సంగతి తెలిసిందే.ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం మరింత జుట్టు పెంచాడు బన్నీ.
"""/" /
తాజాగా పిలక వేసుకొని బన్నీ ఆహా ఆఫీస్ కి వచ్చాడు.
దీంతో బన్నీ పిలక లుక్ వైరల్ గా మారింది.బన్నీని పిలక చూడటం ఇదే మొదటిసారి అని, ఈ లుక్ లో కూడా బన్నీ బాగున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక కొంతమంది అయితే ఈ లుక్ పుష్ప 2 లో ఉంటుందా? పిలక వేసింది పుష్ప 2 సినిమా కోసమేనా అని కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుకుమార్( Sukumar ) తో దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
పుష్ప 2 కోసం అల్లు అర్జున్ కి నిజంగానే 300 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారా..?