లోకేష్ చెప్పిన కథ నచ్చి తనతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరో లు మంచి సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతు ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ( Allu Arjun )ఒకరు.
ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తన లాస్ట్ సినిమా అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన హిట్ సాధించాడు.
ఇక అందులో భాగంగానే ఆయన నటనకి గాను ఆయనకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది.
"""/" /
ఇక ఆ అవార్డ్ ని కూడా రీసెంట్ గా ఆయన అందుకోవడం జరిగింది.
ఇక ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాలో ( Pushpa 2 Movie )బిజీగా గడుపుతున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanagaraj )అల్లు అర్జున్ కి ఒక కథ చెప్పాడు అది విన్న అల్లు అర్జున్ కి ఆ స్క్రిప్టు పిచ్చిపిచ్చిగా నచ్చడంతో ఆ స్టోరీ ని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 సినిమా( Khaidi 2 ) చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
"""/" /
ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది.
ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత ఈ సినిమాని మొదలు చేసే అవకాశం ఉంది.
అయితే ఇది లోకేష్( Lokesh Kanagaraj ) యూనివర్స్ లో భాగంగా రాబోతోందా లేకపోతే సపరేట్ సినిమా గా రాబోతుందా అనేది తెలియాల్సి ఉంది.
కానీ స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంది అన్నట్టుగా అల్లు అర్జున్ ( Allu Arjun )సన్నిహితులు కూడా తెలియజేస్తున్నారు.
ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తే మాత్రం ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మరే సినిమా కి ఉండదు అని అనడం లో ఎంత మాత్రం సందేశం లేదు.
యూపీఐ ఎక్కువగా వాడుతుంటే ఇలా చేయండి.. లేకపోతే మీ ఎకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం