బన్నీ కారణజన్ముడు అంటోన్న దర్శకుడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేయడంతో పాటు బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తనదైన మార్క్‌తో తెరకెక్కించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో బన్నీ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే స్టార్ట్ చేశాడు.

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ సినిమాలో బన్నీ నటిస్తున్నాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.

అయితే కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.కాగా ఈ సమయంలో బన్నీ తన నెక్ట్స్ మూవీని ఓకే చేసే పనిలో పడ్డాడు.

ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో తన నెక్ట్స్ మూవీ ఉండబోతున్నట్లు బన్నీ తెలిపాడు.

కాగా ఈ సినిమా కోసం ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను కొరటాల ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు ‘కారణజన్ముడు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

బన్నీని మరో లెవెల్‌లో చూపించబోయే ఈ సినిమాతో ఆయన నిజంగానే కారణజన్ముడు అని అభిమానులు అనేలా చేస్తాడట కొరటాల.

మొత్తానికి చిత్ర టైటిల్‌తోనే ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసిన కొరటాల, బన్నీ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమాను అతి త్వరలో అనౌన్స్ చేయబోతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.

కాగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిన వెంటనే పుష్ప చిత్ర షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని బన్నీ చూస్తున్నాడు.

అందరికీ నమస్కారం ! నేను క్రాంతి ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని