టాలీవుడ్ స్టార్ హీరో బన్నీతో నటించిన హీరోయిన్లు ఫేడ్ అవుట్.. ఈ విషయాలను గమనించారా?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే అందం, అభినయం, టాలెంట్ తో పాటుగా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని చెబుతూ ఉంటారు.
అదృష్టం లేక చాలా ఉంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలలో నటించి ఆ తర్వాత ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు.
అలాగే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ అందరు హీరోయిన్లు స్టార్లు కాలేరు.
కొందరైతే కొన్ని చిత్రాలకే ఇండస్ట్రీ నుంచి దూరం అవుతారు.ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్( Allu Arjun ) సరసన నటించిన చాలా మంది హీరోయిన్లు త్వరగానే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయ్యారు.
మరి అల్లు అర్జున్ సరసన నటించి ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
"""/" /
గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం వరుడు ( Varudu ).
ఈ చిత్రంతో భానుశ్రీ మెహ్రా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.హీరోయిన్ సెలక్షన్ పై అనేక విమర్శలు వినిపించాయి.
పైగా వరుడు చిత్రం డిజాస్టర్.దీనితో భానుశ్రీ టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది.
ఈ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా నటించలేదు.పరుగు చిత్రంలో అల్లు అర్జున్, షీలా జంటగా నటించారు.
పరుగు మూవీ మంచి విజయం సాధించింది.ఎన్టీఆర్ అదుర్స్ చిత్రంలో కూడా షీలా నటించింది.
ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్.అయినప్పటికి షీలా టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది.
దాంతో ఎంత తొందరగా వచ్చిందో అంతే తొందరగా ఫెడ్ అవుట్ అయ్యి వెళ్లిపోయింది.
అలాగే అల్లు అర్జున్ నటించిన బన్నీ చిత్రం సూపర్ హిట్ అయింది. """/" /
వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌరి మంజల్ హీరోయిన్ గా నటించింది.
బన్నీ మూవీ(Bunny ) సూపర్ హిట్.కానీ త్వరగానే గౌరి మంజల్ టాలీవుడ్ కి దూరమైంది.
అదేవిధంగా అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి ( Gangotri )రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కింది.
ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.
అదితి అగర్వాల్ కూడా టాలీవుడ్ లో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది.అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ వచ్చిన ఆర్య చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రంలో అనురాధ మెహతా హీరోయిన్ గా నటించింది.హోమ్లీ లుక్స్ తో అనురాధ కుర్రాళ్ళని మాయ చేసింది.
అంత పెద్ద హిట్ దక్కినప్పటికీ అనురారాధ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది.
సంచలనం సృష్టించిన త్రిష..