Bhanu Shri Mehra : బిగ్ బాస్ ఒక చెత్త షో…సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచిన బన్నీ హీరోయిన్?

ఇండియాలోనే అతిపెద్ద రియాలిటీ షోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్( Bigg Boss ) రియాలిటీ షో ఒకటి.

ఈ కార్యక్రమం హిందీ తమిళ కన్నడ తెలుగు భాషలలో ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.

ఇక ఈ కార్యక్రమం గురించి తరచూ ఎన్నో రకాల వివాదాలు జరుగుతూనే ఉంటాయి.

ఈ కార్యక్రమం పట్ల కొంతమంది కోర్టుకు వెళ్లినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పాలి .

ఇలా ఎన్నో వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఈ కార్యక్రమం మాత్రం పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.

"""/" / ఇదిలా ఉండగా తాజాగా మరొక నటి బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది ఒక చెత్త షో అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరి బిగ్ బాస్ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ హీరోయిన్ మరెవరో కాదు అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన వరుడు సినిమాలో హీరోయిన్గా నటించిన భాను శ్రీ మెహ్రా( Bhanu Sree Mehra ) .

ఈమె వరుడు సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే మొదటి సినిమా ద్వారా ఈమె ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయారు.

అనంతరం పలు సినిమాలలో నటించిన ఈమెకు గుర్తింపు రాలేదు కాని పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

"""/" / గత కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ విషయంలో ఈమె పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.

అల్లు అర్జున్ తనని బ్లాక్ చేసారంటూ ఈమె పెద్ద ఎత్తున ఆయన గురించి కామెంట్ చేశారు.

ఇలా ఒక్కసారిగా వార్తల్లో నిలిచినటువంటి ఈమె మరోసారి బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన దృష్టిలో బిగ్ బాస్ కార్యక్రమం ఒక చెత్త షో అని ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తున్నారో నాకు అసలు ఏ మాత్రం అర్థం కాలేదని తెలిపారు.

నా దృష్టిలో ఇది ఒక చెత్త షో అని తన ఇన్ స్టా ఫీడ్ అంతా కూడా బిగ్ బాస్ వీడియోలతోనే నిండిపోయింది అంటూ ఈమె కామెంట్ చేశారు.

అయితే ఈమె హిందీ బిగ్ బాస్( Hindi Bigg Boss ) గురించి కామెంట్స్ చేసినప్పటికీ ఇది అన్ని భాషలలో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు వర్తిస్తుందని చెప్పాలి.

ఏది ఏమైనా ఈ కామెంట్లతో మరోసారి ఈమె వార్తలు నిలిచారు.

ట్రంప్‌పై హత్యాయత్నం: మహిళా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్‌ విమర్శలు, హోంలాండ్ సెక్యూరిటీ చీఫ్ కౌంటర్