పుష్పలో అల్లు అర్జున్ హీరోనా? విలనా?
TeluguStop.com
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప".
ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో మనకు కనిపిస్తారు.
ఈ క్రమంలోనే గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసే పాత్రలో అల్లు అర్జున్ కనిపించడంతో ఈ పాత్ర పై కొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
అసలు స్మగ్లింగ్ చేసే బ్యాచ్ లో ఉండే అల్లు అర్జున్ సినిమాకి హీరో ఎలా అవుతాడు.
అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం పుష్ప సినిమా నుంచి విలన్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేశారు.
ఇందులో ఫహద్ బన్వర్ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు చూపించారు.
పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండే ఫహద్ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్ప రాజ్ ను పట్టుకోవాలి.
ఈ కథాంశం చూస్తే అందరికీ ఈ సినిమాలో హీరో అల్లు అర్జునా లేక విలనా అనే సందేహం కలుగుతుంది.
"""/"/
ఈ విధంగా ఈ సినిమాలో గంధపు చెక్కల స్మగ్లింగ్ చేస్తూ విలన్ గా కనిపించే అల్లు అర్జున్ ఏ విధంగా హీరోగా మారుతాడు, అలాగే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉంటూ ఫహద్ విలన్ గా ఏ విధంగా మారాడు అనే విషయం పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
ప్రస్తుతం ఈ పుష్ప సినిమాపై ఎన్నో అనుమానాలు తలెత్తేడంతో ఈ సినిమాపై మరింత ఉత్కంఠతను నెలకొల్పినదని చెప్పవచ్చు.
మరి ఇందులో విలన్ హీరోగా, హీరోలు విలన్లుగా ఎలా మారారు అనే విషయం తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి ఉండాలి.
ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 25 న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!