నేను రోడ్డు షో చేయలేదు.. ఈ ఘటనలో నా తప్పులేదు: అల్లు అర్జున్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అభిమాని మరణించడంతో ఈ విషయంలో అల్లు అర్జున్( Allu Arjun ) పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్నారు.

ఇక పోలీసులు తనపై కేసు నమోదు చేయడం పోలీసులు తనని అరెస్టు చేసి జైలుకు పంపించడం కూడా జరిగింది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చారు.ఇకపోతే ఈ అరెస్టు విషయం పూర్తిస్థాయిలో రాజకీయంగా యూటర్న్ కావడంతో సంచలనంగా మారింది.

ఏకంగా అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందిస్తూ తీవ్ర విమర్శలు కురిపించారు.

ఇలా అల్లు అర్జున్ గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు.

"""/" / ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.సంధ్య థియేటర్ దగ్గర జరిగింది దురదృష్టకరమైన ఘటన అని, అందులో ఎవరి తప్పు లేదని, అదొక యాక్సిడెంట్ అని అల్లు అర్జున్ తెలిపారు.

అభిమానులకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాం.పోలీసుల ప్రొటెక్షన్ ఇవ్వాలని అనుకున్నారు.

అదొక హ్యూమన్ యాక్సిడెంట్.ఎవరి కంట్రోల్ లో లేదు.

రేవతి కుటుంబానికి( Revathi Family ) నా ప్రగాఢ సానుభూతి.థియేటర్లకు వచ్చిన మనుషులను నవ్వించి బయటకు పంపించాలని అనుకునే వ్యక్తిని.

థియేటర్ అనేది ఒక దేవాలయం లాంటిది అక్కడికి వచ్చిన వారందరూ సంతోషంగా వెళ్లాలనుకుంటాను కానీ ప్రమాదంలో గాయపడితే నాకంటే బాధపడేవారు ఎవరు ఉండరు.

ఇప్పటికీ ఆ చిన్నారి హెల్త్ అప్డేట్ ప్రతి గంటకు తెలుసుకుంటున్నానని తెలిపారు. """/" / సంధ్య థియేటర్ తొక్కిసలాట( Sandhya Theatre Stampede ) ఘటన నాకు ఏమాత్రం తెలియదని తెలిపారు.

  ఇక నేను పోలీసులు పర్మిషన్ లేకుండా అక్కడికి వచ్చానని చెబుతున్నారు కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వడంతోనే నేను థియేటర్ వద్దకు వచ్చానని తెలిపారు.

నేను వెళ్లేసరికి పోలీసులు క్లియర్ చేస్తున్నారు.వాళ్ళ డైరెక్షన్ లో వెళుతున్నాను.

ఒకవేళ పర్మిషన్ లేకపోతే పోలీసులు వెనక్కి వెళ్లిపొమ్మని చెప్పేవారు.అప్పుడు వెళ్ళిపోతాం.

పోలీసులు క్లియర్ చేస్తుంటే పర్మిషన్ ఉందనుకొని వెళ్ళాను.నేను ఎక్కడ రోడ్డు షో చేయలేదు.

థియేటర్ దగ్గరకు కొన్ని మీటర్ల దూరంలో కార్ ఆగింది.ఒక పాయింట్ తర్వాత బోలెడు మంది జనాలు వస్తారు.

మీరు ఒక్కసారి చెయ్యి ఊపండి వాళ్లే వెళ్లిపోతారనీ బౌన్సర్స్, పోలీసులు చెబుతారు.అందుకే హ్యాండ్ వేవ్ ఇస్తాం.

సెలబ్రిటీలు ఎవరినైనా అడగండి.వేవ్ చేస్తే ఫ్యాన్స్ కదులుతారు.

వేలమంది ఫ్యాన్స్ వచ్చినప్పుడు కారులో కూర్చుంటే పొగరు చూపించినట్టు ఉంటుందనీ ఈ ప్రమేయంలో నా తప్పు లేదని అనుకోకుండా ఈ ఘటన జరిగింది అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.

నీటి కోసం వెళ్లిన సింహానికి మొసలి ఊహించని షాక్.. వీడియో వైరల్..