పుష్ప 2 టీజర్ రీ క్రియేట్ చేసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే?
TeluguStop.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఇటీవల నటించినటువంటి చిత్రం పుష్ప.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో సుకుమార్ ( Sukumar ) ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప 2( Pushpa 2 ) సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో షూటింగ్ పనులు కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నారు.
"""/" /
ఇటీవల పుష్ప 2 సినిమా నుంచి అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ వీడియో విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇందులో అల్లు అర్జున్ అమ్మ వారి గెటప్ లో కనిపించి అందరిని సందడి చేశారు .
ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోనే ఈ టీజర్ వీడియోని కట్ చేసి విడుదల చేశారు.
ఇక ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.ఈ టీజర్ వీడియో చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతుంది.
"""/" /
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ టీజర్ వీడియోని కూడా రీ క్రియేట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ బుడ్డోడు అచ్చం పుష్ప గెటప్ లో కనిపించి టీజర్ లో ఏ విధంగా అయితే పుష్పరాజ్ నటించారో అదేవిధంగా నటించి సందడి చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పుష్పం మేకర్స్ వరకు వెళ్ళింది.
ఇక ఈ వీడియోని పుష్ప నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ టీజర్ రీక్రియేట్ చేసినవారిని అభినందించింది.
టీజర్ రీక్రియేట్ చేసిన వారిపై ప్రశంసలు కురిపించింది.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.
పాన్ ఇండియా సక్సెస్ కొట్టడానికి ట్రై చేస్తున్న స్టార్ డైరెక్టర్…