కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్.. స్పీడు మాములుగా లేదుగా!
TeluguStop.com
సాధారణంగా సినిమా హీరోలు సినిమా రంగంలో అగ్రస్థానంలో రాణిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం కోసం చాలామంది వ్యాపార రంగంలోకి అడుగు పెడతారు.
ఈ విధంగా ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఎన్నో రకాల బిజినెస్ లను ప్రారంభిస్తున్నారు.
మహేష్ బాబుకు మల్టీప్లెక్స్ థియేటర్ ఉండగా అలాగే ఎన్నో రకాల బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
అదే విధంగా విజయ్ దేవరకొండ సైతం అలాగే మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టడమే కాకుండా రౌడీ బాయ్స్ అనే ఒక దుస్తుల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు.
ఈ విధంగా ప్రతి ఒక్కరు సినిమాలలో నటిస్తూనే బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్నారు.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఆయన బ్రాండ్ నేమ్ ఏఏ(AA) పేరుతో కొత్త బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడం కోసం శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
దక్షిణాది స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.
ఈ క్రమంలోనే సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. """/" /
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన పేరు మీదుగా ఏఏ (AA) బ్రాండెడ్ కు సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు .
ఈ క్రమంలోనే ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్ళిన ఇదే బ్రాండ్ దుస్తులను ధరిస్తూ తన బ్రాండ్ కి బాగానే ప్రచారం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ధరించే దుస్తుల వెనక తన నేమ్ బ్రాండ్ ఏఏ(AA) కనపడటం మనం గమనించవచ్చు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన పేరుతోనే దుస్తుల వ్యాపారంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే దుస్తుల వ్యాపారంలో విజయ్ దేవరకొండ సమంత అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.
"""/" /
సినిమాల పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లుఅర్జున్ బిజినెస్ మెన్ గా ఎలా గుర్తింపు పొందుతారు,ఎంతవరకు ఈ వ్యాపారంలో అల్లు అర్జున్ సక్సెస్ అవుతారు అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న అల్లుఅర్జున్ త్వరలోనే పుష్ప పార్ట్ 2 సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే మొదటి పార్ట్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందిన సంగతి అందరికి తెలిసిందే.
గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!