వైఫ్ తో వైన్ తాగుతూ డేట్ నైట్ ఎంజాయ్ చేసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.

తను నటించే సినిమాలలో తన పాత్రలతో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

అంతే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.ఇటీవలే విడుదలైన పాన్ ఇండియా మూవీ పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు.

ఇక అల్లు అర్జున్ సినీ రంగంలోనే కాకుండా.తన కుటుంబంతో కూడా బిజీగా ఉంటాడు.

ఒకవైపు సినిమాలకు ఇంపార్టెంట్ ఇస్తూనే మరోవైపు తన కుటుంబానికి మంచి బాధ్యత గల వ్యక్తి గా ఉంటాడు.

తన కుటుంబానికి సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటాడు.అంతే కాకుండా తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు.

ఏదైనా పండుగ వేడుకలలో లేదా స్పెషల్ ఈవెంట్ లలో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటాడు.

ఇక తన భార్య స్నేహారెడ్డి గురించి అందరికీ తెలిసిందే.ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

చాలావరకు అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది. """/"/ దీంతో ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

వీరికి ఒక కూతురు, కొడుకు ఉండగా తన కూతురు అల్లు అర్హ వెండితెర పరిచయం కూడా చేసింది.

సమంత నటించిన శాకుంతలం సినిమాలో అర్హ ఒక పాత్రలో చేసింది.ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక అల్లు అర్జున్ తన గారాల కూతురు తో చేసే అల్లర్లు అంతా ఇంతా కాదనే చెప్పాలి.

తన కూతురు తో కలిసి అల్లు అర్జున్ ఎన్నో వీడియోలు చేస్తుంటాడు.ఇక తన బాబు అయాన్ తో కూడా ఎన్నెన్నో ఆటలు ఆడుతుంటాడు.

ఇక పిల్లలు ఇద్దరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి బాగా పరిచయం అయ్యారు.అల్లు అర్జున్ తన పిల్లల విషయంలో ప్రతి ఒక్క విషయాన్ని ప్రేక్షకులకు, అభిమానులకు తెలియజేస్తుంటాడు.

"""/"/ స్నేహ రెడ్డి మాత్రం అల్లు అర్హ, అయాన్ కలిసి చేసిన డ్యాన్సుల వీడియోలను, ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అందరికి షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని స్టోరీస్ పంచుకుంది.

అందులో తన భర్త అల్లు అర్జున్ తో కలిసి తను డేట్ నైట్ కు బయటికి వెళ్ళింది.

ఇక అల్లు అర్జున్ ను ఫొటోస్ దింపి వాటిని షేర్ చేసుకోగా అందులో అల్లు అర్జున్ వైన్ తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించాడు.

ఇక ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారటం తో ఆయన అభిమానులు తెగ లైకులు, కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్2 సినిమాతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా పలు అవకాశాలు అందుకుంటున్నట్లు తెలిసింది.

రెమ్యునరేషన్ ను రెట్టింపు చేసిన హీరోయిన్ కీర్తి సురేష్.. పారితోషికం ఎంతంటే?