విరాళం ప్రకటించి వాళ్ల నోర్లు మూయించిన అల్లు అర్జున్.. ఎంత ప్రకటించారంటే?
TeluguStop.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు( Allu Arjun ) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చాలామంది స్టార్ హీరోలు విరాళం ప్రకటించగా బన్నీ విరాళం ప్రకటించలేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.
మరి కొందరు ఏకంగా పిసినారి పుష్ప అంటూ బన్నీపై ట్రోల్స్ చేశారు.అయితే ఎట్టకేలకు ఆ విమర్శలకు చెక్ పెట్టడం ద్వారా బన్నీ వార్తల్లో నిలిచారు.
"""/" /
తాజాగా అల్లు అర్జున్ విరాళంగా( Allu Arjun Donation ) కోటి రూపాయలు ప్రకటించి వార్తల్లో నిలిచారు.
అల్లు అర్జున్ స్పందించడం లేట్ కావచ్చు కానీ స్పందించడం మాత్రం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయల చొప్పున బన్నీ విరాళం ప్రకటించడంపై ప్రశంసలు వినిపిస్తున్నాయి.
బన్నీ మంచి మనస్సును నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. """/" /
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ఏకంగా 700 కోట్ల రూపాయల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.
ఈ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు రావడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పుష్ప ది రూల్ మూవీపై ఇతర భాషల్లో సైతం అంచనాలు పెరుగుతుండటం కొసమెరుపు.
పుష్ప ది రూల్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెల 6వ తేదీన విడుదల కానుంది.
పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది.
రష్మికకు ఈ సినిమాతో మరో భారీ హిట్ దక్కనుందని అభిమానులు ఫీలవుతున్నారు.పుష్ప2 మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 120 నుంచి 130 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.
బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా టాప్ లో ఉన్నారు.
పిఠాపురంలో భారీ ఆస్తులను కొన్న డిప్యూటీ సీఎం పవన్!